సిద్దవటం మండలం పి.కొత్తపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (సోషియల్) పోస్టుకు అకడమిక్ ఇన్స్ట్రక్టర్గా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో-1 నాగరత్న ఎంఈవో-2 అరుణ తెలిపారు. ఎంపికైన వారు సెప్టెంబరు 1 నుంచి 2027 ఏప్రిల్ 22 వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. నెలకు రూ.12,500 గౌరవ వేతనం చెల్లిస్తామని పేర్కొన్నారు. ఈనెల 21లోపు సిద్దవటం ఎంఈవో కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని వారు సూచించారు.


