संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल

Tag: Ramesh Naidu

తూర్పు గోదావరి

వైసీపీ నేతలకు సుబ్బారెడ్డి సవాల్‌

చెరువులు, కాలువలపై ముఖాముఖి చర్చకు సిద్ధమని వెల్లడి బలభద్రపురం, అక్టోబరు 3 (పున్నమి ప్రతినిధి): బలభద్రపురం గ్రామంలోని చెరువులు, కాలువలు, ముంపు సమస్యపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలకు టీడీపీ నాయకుడు సుబ్బారెడ్డి స్పందించారు. సంత మార్కెట్‌ వద్ద ఉన్న ఊరచెరువును పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాపవరం వెదుళ్ల చెరువు నుంచి మిగులు నీరు కలింగల ద్వారా ఊరచెరువులోకి చేరి, అక్కడి తూము, సుమారు 12 అడుగుల బోధి ద్వారా దిగువ ప్రాంతాలకు వెళ్లే సహజ నీటి ప్రవాహ వ్యవస్థ గతంలో ఉండేదని తెలిపారు. వాకింగ్‌ ట్రాక్‌ పేరుతో చెరువు చుట్టూ నిర్మాణాలు చేపట్టి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో మార్గాలకు తగిన తూములు ఏర్పాటు చేయకపోవడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడిందని ఆరోపించారు. 2013 నీలం తుఫాను సమయంలో బలభద్రపురం గ్రామంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని, 2014లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సుమారు రూ.30 లక్షలతో కాలువ పనులు చేపట్టి నీటిని గోదావరి కాలువలోకి మళ్లించే ఏర్పాట్లు చేసినట్లు సుబ్బారెడ్డి తెలిపారు. గీతా మందిరం వెనుక ఉన్న 12 అడుగుల బోధి, కాలువలు, పుంతల పరిస్థితిపై రికార్డులతో సహా చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మాజీ సర్పంచ్‌ కర్రి సత్యనారాయణరెడ్డి, మాజీ ఎంపీటీసీ వీరరాఘవరెడ్డితో పాటు వైసీపీ నాయకులు ముఖాముఖి చర్చకు రావాలని సవాల్‌ చేశారు. మత్స్యకార కుటుంబాలు నిర్మించిన బండకు సంబంధించి తాము ఎలాంటి బిల్లులు తీసుకోలేదని స్పష్టం చేసిన సుబ్బారెడ్డి.. తాము బిల్లులు తీసుకున్నట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ చేశారు. అదే విధంగా ప్రభుత్వం ఇచ్చిన పట్టాల పరిమితిని మించి నిర్మాణాలు చేపట్టలేదని వైసీపీ నాయకులు నిరూపించాలని కోరారు. చెరువులు, కాలువలపై రాజకీయ ఆరోపణలకు బదులుగా రికార్డుల ఆధారంగా వాస్తవాలను ప్రజల ముందుంచాలని ఆయన అన్నారు.

తూర్పు గోదావరి

వైసీపీ నేతలకు సుబ్బారెడ్డి సవాల్‌

బలభద్రపురం, అక్టోబరు 3 (పున్నమి ప్రతినిధి): గ్రామంలోని చెరువులు, కాలువలు, ముంపు సమస్యపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలకు సుబ్బారెడ్డి స్పందించారు. వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణంతో ఊరచెరువుకు నీటి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో మార్గాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. 2014లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సుమారు రూ.30 లక్షలతో ముంపు నివారణ కాలువ పనులు చేపట్టినట్లు తెలిపారు. 12 అడుగుల బోధి, కాలువలపై రికార్డులతో ముఖాముఖి చర్చకు సిద్ధమన్నారు. బండ నిర్మాణానికి తాము బిల్లులు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వైసీపీ నేతలకు సవాల్‌ విసిరారు.

తూర్పు గోదావరి

స్వచ్ఛతే సంకల్పం.. పరిశుభ్రతే లక్ష్యం

స్వచ్ఛత కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి అనపర్తి, అక్టోబరు 3 (పున్నమి ప్రతినిధి): ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న “స్వచ్ఛ సంకల్ప అభియాన్”లో భాగంగా అనపర్తి ప్రెస్‌క్లబ్ ప్రాంతంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రోడ్లను శుభ్రపరిచారు. బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రామ్‌కుమార్, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం కృషి చేయాలని కోరారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో, తహసీల్దార్‌తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

వైద్య సహాయానికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత

అరికరేవుల, అక్టోబరు 2 (పున్నమి ప్రతినిధి): అరికరేవుల గ్రామానికి చెందిన సుందరినిడి వెంకటేష్‌ వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి మంజూరైన రూ.42,000 విలువైన చెక్కును అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు. అనపర్తి నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావుతో కలిసి వెంకటేష్‌ కుటుంబ సభ్యులకు చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

హర్షిత పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం

గుంటూరు, అక్టోబరు 1 (పున్నమి ప్రతినిధి): తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం కేశవరం గ్రామానికి చెందిన గారపాటి శ్రీనివాస్‌, తులసి దంపతుల కుమార్తె హర్షిత పుట్టినరోజు సందర్భంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి ఆధ్వర్యంలో గుంటూరు పట్టణంలోని నల్లపాడులో ఉన్న క్షేమంకరి వృద్ధాశ్రమంలో మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు భోజనం వడ్డించారు. సేవా కార్యక్రమానికి సహకరించిన దాతలకు వృద్ధాశ్రమం నిర్వాహకులు, సిబ్బంది, వృద్ధులు కృతజ్ఞతలు తెలిపారు.

తూర్పు గోదావరి

జ్ఞాపకార్థం వృద్ధాశ్రమంలో అన్నదానం

పర్చూరు, సెప్టెంబరు 29 (పున్నమి ప్రతినిధి): తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం కేశవరం గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి ఉపాధ్యక్షులు ఉండమట్ల వీరబాబు తండ్రి కీ.శే. ఉండమట్ల సత్యనారాయణ, తాతయ్య కీ.శే. ఉండమట్ల సూర్యారావు, నాయనమ్మ శ్రీమతి గోవిందమ్మ, చిన్నాన్న కీ.శే. ఉండమట్ల కామేశ్వరరావు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల సహకారంతో పర్చూరులోని ఆశ్రయ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు భోజనం వడ్డించారు. తమ కుటుంబ పెద్దల జ్ఞాపకార్థం వృద్ధులకు అన్నదానం చేయడం ద్వారా వారి జ్ఞాపకాలను సేవా కార్యక్రమంగా కొనసాగిస్తున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన కుటుంబ సభ్యులకు ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

తూర్పు గోదావరి

చికిత్స పొందుతూ యువకుడి మృతి

విషాదంలోనూ నేత్రదానం చేసిన తల్లిదండ్రులు బిక్కవోలు, సెప్టెంబరు 29 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలు కొత్తపేటకు చెందిన కల్లేపల్లి శివరామకృష్ణ (26) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నెల 21న గోకవరంలో శుభకార్యానికి వంట పనికి వెళ్లిన శివరామకృష్ణ, 23న రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా బలభద్రపురం–కానేడు రోడ్డుపై తుఫాన్‌ కారణంగా మోటార్‌బైక్‌ అదుపుతప్పి జారిపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో 108 ద్వారా అనపర్తి ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కుమారుడి మృతితో విషాదంలో ఉన్న తల్లిదండ్రులు మానవత్వాన్ని చాటుతూ అతడి రెండు నేత్రాలను లకంసాని విరీన్ మానస్ రెడ్‌క్రాస్ ‘ఐ’ బ్యాంక్‌, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, కాకినాడకు దానం చేశారు. ఈ నేత్రాలను ఇద్దరు అంధులకు చూపు అందించేందుకు వినియోగించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నేత్రదానానికి ముందుకొచ్చిన తల్లిదండ్రుల నిర్ణయాన్ని స్థానికులు అభినందించారు.

తూర్పు గోదావరి

పెదపూడి మండలాన్ని ముంపు నుంచి శాశ్వతంగా కాపాడుతాం

కాకినాడ, సెప్టెంబరు 28 (పున్నమి ప్రతినిధి): తుఫాను ప్రభావంతో పెదపూడి మండలంలో ఏర్పడుతున్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. కాకినాడ కలెక్టరేట్‌లో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఐఏఎస్ సమక్షంలో డ్రైన్స్, ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులతో ముంపు సమస్యపై సమీక్షించారు. బిక్కవోలు డ్రైన్, ఇతర చిన్న డ్రైన్లు, వెస్ట్ ఏలేరు డ్రైన్‌లను డ్రెడ్జింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. గోదావరి డెల్టా ఆధునికీకరణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. పెదపూడి ముంపుపై సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

బీసీలంతా ఐక్యతతో ఉంటే అండగా ఉంటాం: ఎమ్మెల్యే నల్లమిల్లి

రంగంపేట, సెప్టెంబరు 28 (పున్నమి ప్రతినిధి): బీసీలంతా ఐక్యంగా ఉంటే వారి అభ్యున్నతి, సంక్షేమం కోసం తాము అండగా నిలుస్తామని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. రంగంపేటలో బీసీలకు కోటి రూపాయల విలువైన స్థలం అందించేందుకు ప్రయత్నిస్తుంటే అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బీసీ సంక్షేమం కోసం జరుగుతున్న కార్యక్రమాలకు సంఘీభావం తెలిపి, సమస్యలపై ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. సభలు, సమావేశాలు వ్యక్తుల కోసం కాకుండా సంఘం ప్రయోజనాల కోసం నిర్వహించాలని సూచించారు. నియోజకవర్గంలోని పులగుర్త, పెదపూడి, వడిసలేరు, ఎస్టీ రాజాపురం చేనేత క్లస్టర్లకు నిధులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. బీసీల హక్కులు, అభ్యున్నతి కోసం అందరూ ఐక్యతతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

తూర్పు గోదావరి

బెదిరింపుల వల్లే అప్పట్లో రామకృష్ణారెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేశా

నెల్లిమర్ల శ్రీనివాసరావు వెల్లడి.. ఎమ్మెల్యేకు క్షమాపణలు అనపర్తి, సెప్టెంబరు 28 (పున్నమి ప్రతినిధి): అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై గతంలో తాను చేసిన ఆరోపణలు వాస్తవాలు తెలియక, అప్పటి కొందరు వైఎస్సార్‌సీపీ నాయకుల ఒత్తిడి, బెదిరింపుల కారణంగానే చేశానని కుతుకులూరుకు చెందిన నెల్లిమర్ల శ్రీనివాసరావు తెలిపారు. దొంతమూరు గ్రావెల్ క్వారీ వ్యవహారంలో ఎమ్మెల్యేకు రూ.18 లక్షలు ఇచ్చామని తాను గతంలో చెప్పినప్పటికీ, ఆ డబ్బులు ఇచ్చిన విషయం తనకు వ్యక్తిగతంగా తెలియదని స్పష్టం చేశారు. తనకు ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయాలని కొందరు ఒత్తిడి చేశారని, తొలుత తాను నిరాకరించినప్పటికీ తనపై కేసులు పెడతామని, జైలుకు పంపుతామని బెదిరించడంతో చివరకు ఆ స్క్రిప్ట్‌ను చెప్పాల్సి వచ్చిందని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు పూర్తి వాస్తవాలు తెలియవని, గతంలో చేసిన ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. తన వల్ల జరిగిన ఇబ్బందులకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తనను క్షమించాలని శ్రీనివాసరావు కోరారు. తాను గతంలో మాట్లాడిన వీడియోను డాక్టర్ సూర్యనారాయణరెడ్డి పదేపదే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ, తన కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పాత వీడియోను తిరిగి వైరల్ చేయకుండా తనను ఇబ్బందులకు గురిచేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.