संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल

Tag: politics

మహబూబాబాద్

అసలు ఈ నేహా బోరా ఎవరు?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేహా బోరా ఎవరు? ఆమె విద్యార్థి రాజకీయ ప్రయాణం ఎందుకు అంత ప్రత్యేకం? 29 ఏళ్ల నేహా బోరా ఉత్తరాఖండ్‌కు చెందిన యువ విద్యార్థి నాయకురాలు. ఆమె తండ్రి భారతీయ సైన్యంలో అత్యున్నత హోదాలో (ఆర్మీలో ఉన్నత అధికారిగా) దేశానికి సేవ చేసిన వ్యక్తి. మిలిటరీ నేపథ్యం, నుంచి వచ్చినప్పటికీ సమాజంలోని అసమానతలను, ప్రభుత్వాల వైఫల్యాలను ప్రశ్నించే దృక్పథాన్ని నేహా ఎంచుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేసిన నేహా , ప్రస్తుతం జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో థియేటర్ అండ్ పెర్ఫార్మెన్స్ విభాగంలో PhD రీసెర్చ్ స్కాలర్‌గా కొనసాగుతున్నారు. విద్యార్థి దశలోనే థియేటర్ ద్వారా సామాజిక సమస్యలపై గళం ఎత్తిన ఆమెకు, ఒక పొలిటికల్ థియేటర్ గ్రూప్ ద్వారా వామపక్ష AISAతో పరిచయం ఏర్పడింది. అక్కడి నుంచి విద్యార్థి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె, 2019లో CAA వ్యతిరేక ఉద్యమాల్లోనూ క్రియాశీలకంగా పాల్గొన్నారు. దేశాన్ని కుదిపేస్తున్న పేపర్ లీకులు, పరీక్షల పారదర్శకత లోపాలు, తీవ్రమైన నిరుద్యోగం మరియు విద్యా వ్యవస్థ వైఫల్యాలపై ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు. జంతర్ మంతర్ వద్ద ఏకంగా 23 రోజుల పాటు అసాధారణమైన నిరాహార దీక్ష చేపట్టడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. నిన్న ఢిల్లీలో బీజేపీ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం జరిగిన నిరసనలో ఆమెను బలవంతంగా అరెస్ట్ చేయాలని బీజేపీ ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నించింది. పోలీసులు ఆమెను అడ్డుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. కానీ ఆమె చూపిన అసాధారణ తెగింపు, పోరాట పటిమ ముందు పోలీసుల బలప్రయోగం తేలిపోయింది; ఆ ధైర్యం చూసి చివరకు పోలీసులే వెనకడుగు వేయాల్సి వచ్చింది. యువత గొంతు నొక్కాలని, ప్రజాస్వామ్య ఉద్యమాలను అణచివేయాలని బీజేపీ ఎన్ని కుట్రలు పన్నినా… నేహా బోరాను అడ్డుకోవడం ఆ పార్టీ వల్ల కాలేదు. ఆమె సంకల్పం ముందు పాలకవర్గాల బెదిరింపులు పూర్తిగా బలాదూర్ అయ్యాయి. అధికార బలంతో ఎవరినైనా అణచివేయవచ్చనే అహంకారానికి, భయపడని ఒక యువత స్వరం ఎలా ఎదురునిలుస్తుందో నేహా బోరా నిరూపించారు. థియేటర్ వేదిక నుంచి విద్యార్థి ఉద్యమ రణరంగం వరకు ఆమె సాగిస్తున్న ఈ ప్రయాణం—నియంతత్వ పోకడలను ధైర్యంగా ఎదిరించే ప్రతి ఒక్కరికీ ఇదొక గొప్ప స్ఫూర్తిదాయక గాథ.

తూర్పు గోదావరి

గర్భిణీలు, బాలింతలు, కౌమార బాలికలుపోషణ అభియాన్ పథక లక్ష్యం…తూర్పు గోదావరి జిల్లా బి.జె.పి అధ్యక్షులు.పిక్కి నాగేంద్ర,

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పోషకాహార స్థాయిని మెరుగుపరచడం భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రవేశపెట్టిన పోషణ అభియాన్ పథక లక్ష్యం భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ 25 సంవత్సరాల ప్రజాసేవకు గుర్తుగా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రం ద్వారా నిరంతరం ఉన్నతమైన సేవలు అందిస్తున్న అంగన్వాడీ టీచర్స్ ను ఆయాలను సత్కరించాలని. నరేంద్ర మోదీ ఆదేశాలమేరకు కొవ్వూరు పట్టణంలో కూడా అంగన్వాడి కేంద్రాలలో సేవలందిస్తున్న టీచర్స్ ఆయాలకు బిజెపి ఆధ్వర్యంలో సత్కారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ.. కటిక పేదరికం నుంచి వచ్చిన నరేంద్ర మోదీ పేదల కష్టాలు తెలిసి పేదల ప్రయోజనాల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు. అందులో పోషణ అభియాన్ కార్యక్రమం అత్యంత ప్రధానమైనది. దేశంలోని తల్లులు, చిన్నారులకు పోషక ఆహార లోపం ఉండకూడదని.. ఆరోగ్యకరమైన తల్లులు పిల్లలు ఉంటేనే ఆరోగ్యకరమైన భారత్ ను నిర్మించవచ్చు అని పోషణ అభియాన్ పథకాన్ని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారు. పోషక ఆహార పదార్థాలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా తల్లులకు పిల్లలకు అందిస్తున్నారు. పిల్లల వయస్సు 6 సంవత్సరాలు వచ్చేఅంతవరకు అనగా నర్సరీ, ఎల్.కె.జి, యూ.కె.జి చదువును అంగన్వాడీ కేంద్రాలలో అందుతుంది, ప్రజలు ఉపయోగించుకోవాలి. అంగన్వాడి సిబ్బంది సేవలకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని పిక్కి నాగేంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ ఉదయ భాను కళావతి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిల్లలమర్రి మురళీకృష్ణ, కొవ్వూరు పట్టణ అధ్యక్షులు చెరుకూరి సాయి రామకృష్ణంరాజు, తాడిమళ్ళ విజయవాణి, జిల్లా ఉపాధ్యక్షులు బోడపాటి ముత్యాలరావు, మహిళా మోర్చా అధ్యక్షులు దార్లంక పద్మావతి, నాయకులు తురగా విజయభాస్కర్, నేమాని వెంకట బాలరాణి.. తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

కొవ్వూరులో వై.సి.పి కి భారీషాక్…టీడీపీలోకి భారీ చేరికలు

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరుతూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణం నుంచి సుమారు 200 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు.కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో చేరికల కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ ద్విసభ్య కమిటీ నాయకుల కంట మని రామకృష్ణ, సుబ్బరాయ చౌదరి సమక్షంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.కొవ్వూరు మున్సిపాలిటీలోని 28 వార్డులకు 28 వార్డుల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా టీడీపీ నాయకులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి వార్డులో పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ప్రజలతో నిరంతరం మమేకం కావాలని నాయకులు సూచించారు. కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలకు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తూ వార్డు స్థాయిలో కార్యక్రమాలను ముమ్మరం చేయనున్నట్లు నాయకులు తెలిపారు.

ప్రకాశం

ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రకు ధన్యవాదాలు తెలిపిన దారపనేని, చెనికల

-తూర్పు కోడిగుడ్లపాడు రోడ్డు నిర్మాణానికి రూ.2.40 కోట్ల నిధులు -శంకుస్థాపన చేసిన వెంటనే యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభం -ఎమ్మెల్యే చొరవతో గ్రామ రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం పామూరు, అక్టోబర్ 3(పున్నమి ప్రతినిధి): పామూరు మండలం తూర్పు కోడిగుడ్లపాడు గ్రామ రోడ్డు నిర్మాణానికి రూ.2.40 కోట్ల నిధులు మంజూరు చేసి, శంకుస్థాపన అనంతరం పనులను ప్రారంభించిన కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పోతవరం టీడీపీ నాయకులు చెనికల చిన్న మాలకొండయ్య శుక్రవారం ధన్యవాదాలు తెలిపారు. సుదీర్ఘకాలంగా నిరుపయోగంగా ఉన్న తూర్పు కోడిగుడ్లపాడు గ్రామ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు, రెండు రోజుల క్రితం శంకుస్థాపన చేసిన వెంటనే పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. రహదారి నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజల రాకపోకలకు ఎంతో సౌకర్యం కలుగుతుందని తెలిపారు. గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి చేస్తున్న కృషికి తూర్పు కోడిగుడ్లపాడు గ్రామ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు పనులను వెంటనే ప్రారంభించడం పట్ల ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తూర్పు కోడిగుడ్లపాడు ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను గెలిపించి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డికి కానుకగా అందిస్తామని టీడీపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పు కోడిగుడ్లపాడు టీడీపీ నాయకులు దారపనేని రాజేంద్రప్రసాద్, జంగాలపల్లి టీడీపీ నాయకులు మానం మల్లికార్జున యాదవ్, పోతవరం టీడీపీ నాయకులు మిరియం సుబ్బరాయుడు, మిరియం గురువయ్య, గడిపూటి వెంకటేశ్వరరావు, తిరివీధి చంద్ర, తిరివీధి హజరత్ తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మాధవరం నగర్ కాలనీ డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం నందు స్థానిక నాయకులతో కలిసి గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సత్యం, అహింస, శాంతి, సహనం వంటి మహాత్మా గాంధీ చూపిన విలువలు నేటి సమాజానికి కూడా ఎంతో అవసరమని అన్నారు. స్వాతంత్ర్య సమరంలో గాంధీజీ చేసిన సేవలు, ప్రజలను ఏకం చేసి అహింసా మార్గంలో నడిపించిన తీరు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ సత్యం, అహింస, స్వచ్ఛత, సామాజిక బాధ్యత వంటి విలువలను తమ జీవితాల్లో ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, పాల్గొని మహాత్మా గాంధీజీకి ఘన నివాళులు అర్పించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కావలి పట్టణంలో సర్వేగంగా సాగుతున్న డ్రైనేజీ, రోడ్డు విస్తరణ పనులను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే

కావలి నియోజకవర్గం అభివృద్ధికి కేర్‌ఆఫ్ అడ్రస్‌గా మారుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆశీస్సులతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమర్థవంతమైన నాయకత్వంలో నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతోంది. కావలి పట్టణంలో సాగుతున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు.​ఈ క్రమంలో గురువారం కావలి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అధికారులతో పాటు పార్టీ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు…పట్టణ పరిధిలో వేగంగా జరుగుతున్న రోడ్డు విస్తరణ, డ్రైనేజీ,విద్యుత్,పనులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.​ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హయాంలో కావలి అభివృద్ధి..కావలి నియోజకవర్గంలో రూ. 57 కోట్లతో డ్రైనేజీల నిర్మాణం, మురుగునీటి వ్యవస్థ మెరుగుపరిచే పనులు శరవేగంగా జరుగుతున్నాయి.కావలి పట్టణంలో అత్యంత కీలకమైన ట్రంక్ రోడ్డు విస్తరణ పనులు, ఆధునీకరణ వేగవంతంగా సాగుతున్నాయి.​అన్ని రహదారుల సమగ్ర అభివృద్ధి: పట్టణ పరిధిలోని అంతర్గత, ప్రధాన రహదారులన్నింటినీ త్వరలోనే బిటి/సిసి రోడ్లుగా సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు పనులు వేగవంతం చేశారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గడ్డపార చేతబట్టి… డొంక రోడ్డుకు శ్రీకారం చుట్టి…

*గడ్డపార చేతబట్టి… డొంక రోడ్డుకు శ్రీకారం చుట్టి…* సెప్టెంబర్ 29(పున్నమి ప్రతినిధి )ముత్యాల గిరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు గడ్డపారలు చేత పట్టి వీబీ జీ రాంజీ పనులను ప్రారంభించారు. కొత్త డొంక రోడ్డుకు శ్రీకారం చుట్టారు. పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా కొకులవారిపల్లి గ్రామంలో పొలాల మధ్యకు నిర్మించతలపెట్టిన డొంక రోడ్డుకు శ్రమదానం చేశారు. గడ్డపారలతో ముగ్గురు నేతలు మట్టిని తవ్వగా, ఆ గ్రామానికి చెందిన వీబీ జీ రాంజీ శ్రామికులు గంపలతో మట్టిని ఎత్తి రోడ్డు పోశారు. పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో డొంక రోడ్లకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద గ్రామీణ ప్రాంతాలు ఉన్న 167 నియోజకవర్గాల పరిధిలో నియోజక వర్గానికి ఒక్కటి చొప్పున డొంక రోడ్డు నిర్మించనుండగా, ఉదయగిరి నియోజకవర్గం పరిధిలో కొకులవారిపల్లి గ్రామంలో నిర్మించతలపెట్టిన డొంక రోడ్డు పనులను శ్రమదానం ద్వారా గౌరవ ముఖ్యమంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రివర్యులు ప్రారంభించారు. అంతకు ముందు కొకులవారిపల్లి గ్రామంలో పల్లెపండుగ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను ముగ్గురు నేతలు కాలినడకన పరిశీలించారు. గ్రామ సరిహద్దుల్లో పశువుల దాహార్తి తీర్చేందుకు నిర్మించిన నీటి తొట్టె స్వాగతం పలుకగా, గ్రామంలోకి వేసిన బీటీ రోడ్డు, గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డు, రోడ్డుకి సమీపంలో ఉన్న మినీ గోకులాన్ని పరిశీలించారు. రోడ్డు నాణ్యతను తనిఖీ చేశారు. సుమారు కిలోమీటరు మేర కాలినడకన కొకులవారిపల్లి గ్రామ సచివాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ వీబీ జీ రాంజీ శ్రామికులతో కలసి గ్రూప్ ఫొటో దిగారు. అంతకు ముందు తమ గ్రామానికి విచ్చేసిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ పీవీఎన్ మాధవ్ గార్లకు కొకులవారిపల్లి గ్రామానికి చెందిన మహిళలు గ్రామ సరిహద్దుల నుంచి పూల జల్లులతో స్వాగతం పలికారు. మహిళలతో ముచ్చటిస్తూ, సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముగ్గురు నేతలు గ్రామంలోకి నడిచి వెళ్లారు. .

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రామాపురంలో పల్లె పండుగ 3.0 జరిగే బహిరంగ సభకు పమిడిరవి కుమార్ చౌదరి కార్యకర్తలు కు పిలుపు

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంగ్రామం లో జరిగే బహిరంగ సభకి పల్లె పండుగ 3.0 కి దగదర్తి మండలం నుంచి వేల సంఖ్యలతో ప్రజలు తెలుగు దేశం కూటమి కార్యకర్తలు, నాయకులు, తరలిరావాలని దగదర్తి మండలం ఇంచార్జ్ పమిడి రవి కుమార్ చౌదరి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పమిడి రవికుమార్ చౌదరి మాట్లాడుతూ ఈ యొక్క బహిరంగ సభకి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు మంత్రులు సీనియర్ నాయకులు,ఇచ్చేస్తున్నారు కావున ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేసి బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు.

తూర్పు గోదావరి

బి.జె.పి ఆధ్వర్యంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు.

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు:భారత ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాసేవకు గుర్తుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా బిజెపి నాయకులు కార్యకర్తలు కొవ్వూరు పట్టణంలోని బాపూజీ నగర్ లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసి మొక్కలు నాటారు. అనంతరం అల్లూరి నాగరత్నం బాలికోన్నత పాఠశాల విద్యార్థులకు ‘ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులు వలన కలిగే నష్టాలను’ వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ.. స్వచ్ఛ్ భారత్ నినాదాన్ని ప్రతీ రోజూ జీవితంలో భాగస్వామ్యం చేసుకుని మనం నివాసం ఉంటున్న ఇంటితోపాటు పరిసర ప్రాంతాలను, ఊరుని పరిశుభ్రంగా ఉంచే విషయంలో విద్యార్థులు యువత ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరుతున్నాను. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను ఎక్కువగా నాటాలని కోరుతున్నాను. ప్లాస్టిక్ వాడకం వలన వచ్చే నష్టాలతో* ప్రపంచ సంక్షోభం స్థితిలోకి వెళ్ళింది. ఒకసారి వాడి పడేసిన ప్లాస్టిక్ వస్తువుల వలన స్థానిక డ్రైనేజీ వ్యవస్థ పాడవడంతోపాటు త్రాగునీరు, ఆహార పదార్థాల కలుషితంతో మానవాళికి, నది సముద్ర జలాలు కలుషితం కావడంతోపాటు జలచర జీవులకి పెను ముప్పు పొంచి ఉంది. వాతావరంలో వచ్చిన మార్పుల వలన జరుగుతున్న నష్టాలను కూడా మనం చూస్తున్నాము. అనుభవిస్తున్నాము. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కోసం ‘ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులను’ ఎట్టిపరిస్థితుల్లోనూ అరికట్టాలి. పాలిథిన్ కవర్ల స్థానంలో కాటన్ సంచులను వాడాలి. ప్లాస్టిక్ త్రాగునీరు బాటిళ్లను విడనాడాలి. జలాశయాలలోప్లాస్టిక్వస్తువులువాడ కూడదు. పరిశుభ్రం, మొక్కలు నాటడం, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టడం అంశాలలో విద్యార్థులు యువత ప్రజలు చైతన్యం కావాలని కోరుతున్నానని పిక్కి నాగేంద్ర అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిల్లలమర్రి మురళీకృష్ణ, పట్టణ అధ్యక్షులు చెరుకూరి సాయి రామకృష్ణంరాజు, జిల్లా ఉపాధ్యక్షులు బోడపాటి ముత్యాలరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు మడిచర్ల రామచంద్రరావు, ప్రధాన కార్యదర్శి ఆలపాటి రామకృష్ణ, యువ మోర్చా పట్టణ అధ్యక్షులు బెనుగు రమేష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు పద్మావతి, సి.హెచ్. దేవి కృష్ణ, సింగిరి సాయి.. తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కావలి తూర్పు గోగులపల్లిలో & పడమర గోగులపల్లిలో ఉప్పు రైతుల కోసం రూ.349.50 కోట్లతో మట్టి రహదారుల నిర్మాణం

కావలి తూర్పు గోగులపల్లిలో & పడమర గోగులపల్లిలో ఉప్పు రైతుల కోసం రూ.349.50 కోట్లతో మట్టి రహదారుల నిర్మాణం SPSR నెల్లూరు జిల్లా,కావలి నియోజకవర్గం లోని అల్లూరు మండలం తూర్పు గోగులపల్లి, పశ్చిమ గోగులపల్లి గ్రామ పంచాయతీలలో SC, ST, BC వర్గాలకు చెందిన ఉప్పు రైతుల ఉప్పు సాగు క్షేత్రాలకు మట్టి రహదారుల నిర్మాణానికి రూ.349.50 లక్షలు (రూ.3.495 కోట్లు) మంజూరు చేశారు. రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ చేసిన విజ్ఞప్తి మేరకు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కె. పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పనులకు నిధులు సమకూర్చారు. గోగులపల్లి గ్రామానికి భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ప్రత్యేకమైన స్థానం ఉంది. సముద్రతీరానికి సమీపంలో ఉండటం, సంప్రదాయంగా ఉప్పు ఉత్పత్తి జరిగే ప్రాంతం కావడంతో 1930లో మహాత్మా గాంధీ పిలుపునిచ్చిన ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమానికి నెల్లూరు జిల్లాలో గోగులపల్లి ఒక ముఖ్య కేంద్రంగా నిలిచింది. గోగులపల్లి ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వం విధించిన ఉప్పు చట్టాన్ని వ్యతిరేకిస్తూ సత్యాగ్రహంలో పాల్గొని, ఉప్పు తయారీ ద్వారా వలస పాలనకు వ్యతిరేకంగా అహింసాయుత నిరసనను వ్యక్తం చేశారు. ఈ ఉద్యమం ద్వారా గ్రామీణ ప్రజలు స్వరాజ్యం, స్వదేశీ, అహింస, శాసనోల్లంఘన వంటి జాతీయ భావాలతో మమేకమయ్యారు. నెల్లూరు జిల్లాలో ఈ ఉద్యమం కారణంగా అనేక మంది సత్యాగ్రహులు అరెస్టు కాగా, మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్లు కేంద్ర ప్రభుత్వ చారిత్రక రికార్డులు పేర్కొంటున్నాయి. ఈ ప్రాంతం యొక్క గాఢమైన చారిత్రక నేపథ్యానికి మరింత ప్రాధాన్యతను చేకూర్చే విధంగా, మహాత్మా గాంధీజీ 1933 డిసెంబర్ 30న తన కోస్తా ఆంధ్ర పర్యటనలో భాగంగా అల్లూరును సందర్శించడం ఒక చారిత్రక ఘట్టంగా నిలిచింది. భారత ప్రభుత్వ చారిత్రక రికార్డులు నెల్లూరు జిల్లాలో ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించిన ఉద్యమానికి మైపాడు, గోగులపల్లి, తుమ్మలపెంట, తడ, సుల్లూరుపేట, నావూరు, నాయుడుపేట వంటి గ్రామాలు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయని నమోదు చేశాయి. నేడు ఈ ప్రాంతం భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర, సంప్రదాయ తీరప్రాంత జీవనోపాధులు, ఉప్పు ఉత్పత్తి వారసత్వం—ఈ మూడు అంశాల సమ్మేళనం గోగులపల్లికి నెల్లూరు జిల్లా చరిత్రలో ప్రత్యేక గుర్తింపును కల్పించింది. గోగులపల్లి తీర ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాలు కావడంతో ఇక్కడి ప్రజల్లో గణనీయమైన వర్గం ఉప్పు ఉత్పత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. ఉప్పు క్షేత్రాలకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల ఉప్పును క్షేత్రాల నుంచి నిల్వ కేంద్రాలకు, అక్కడి నుంచి మార్కెట్లకు తరలించడంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు, ట్రాక్టర్లు ఉప్పు క్షేత్రాల వద్దకు చేరుకోలేకపోవడం వల్ల రైతులు చేతులతో ఉప్పును తరలించాల్సి రావడం, రవాణా వ్యయం పెరగడం, వర్షాలు మరియు తీర ప్రాంత వాతావరణం కారణంగా ఉప్పు పాడయ్యే ప్రమాదం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల రైతులు తమ ఉత్పత్తిని బహిరంగ మార్కెట్‌కు తీసుకెళ్లలేక, మధ్యవర్తులపై ఆధారపడాల్సి వస్తోందని, దీని కారణంగా తక్కువ ధరలకు ఉప్పును విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఎంపీ బీద మస్తాన్ రావు యాదవ్ తన విజ్ఞప్తిలో పేర్కొన్నారు. కొత్త రహదారులు ఏర్పడితే ఉప్పు క్షేత్రాలకు వాహన రాకపోకలు సులభమై, మార్కెట్‌కు నేరుగా చేరుకునే అవకాశం పెరిగి, రైతులకు మెరుగైన ధర లభించే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ప్రతిపాదనలో తూర్పు, పశ్చిమ గోగులపల్లి గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 32 రహదారి పనులు, మొత్తం 18,900 మీటర్ల పొడవున, రూ.349.50 మంజూరు చేశారు. ఇందులో తూర్పు గోగులపల్లి పరిధిలో 24 పనులకు 13,450 మీటర్లు – రూ.241.50 లక్షలు, పశ్చిమ గోగులపల్లి పరిధిలో 8 పనులకు 5,450 మీటర్లు – రూ.108 లక్షలు నిధులు సమకూర్చనున్నారు. ఈ రహదారుల నిర్మాణంతో 534 SC/ST/BC ఉప్పు రైతు కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం కలగడంతో పాటు, పరిసర గ్రామాలకు చెందిన సుమారు 3,000 మంది ప్రజలకు ఉప్పు ఉత్పత్తి ప్రక్రియ ద్వారా పరోక్ష ఉపాధి ప్రయోజనం లభిస్తుందని పేర్కొన్నారు. ఉప్పు రైతుల ఉత్పత్తికి మార్కెట్ ప్రాప్యత కల్పించడం, రవాణా సమస్యలను తొలగించడం, మధ్యవర్తులపై ఆధారపడటాన్ని తగ్గించడం, గిట్టుబాటు ధరకు ఉప్పును విక్రయించే అవకాశాలను పెంచడం, SC/ST/BC ఉప్పు రైతుల జీవనోపాధిని పరిరక్షించడం ఈ రహదారి నిర్మాణాల ప్రధాన లక్ష్యాలని శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ తెలిపారు. ఈ చర్య ద్వారా గోగులపల్లి ప్రాంతంలోని సంప్రదాయ ఉప్పు ఉత్పత్తి రంగానికి మౌలిక సదుపాయాల బలోపేతం జరుగుతుందని, ఉప్పు రైతులు, కార్మికుల జీవనోపాధికి మరింత భరోసా లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ రహదారుల నిర్మాణానికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు వి బి జి రామ్ జి క్రింద నిధులు మంజూరు చేసిన గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ కె పవన్ కళ్యాణ్ గారికి శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ గారు ధన్యవాదాలు తెలిపారు.