ఉద్యమకారుడి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండ
*తేదీ 10.10.2026* *దంతాలపల్లి రూరల్* *ముగ్గురు కుమార్తెల భవిష్యత్తు కోసం రూ.10 లక్షల ఆర్థిక సహాయం* *మహబూబాబాద్ జిల్లా, దంతాలపల్లి మండలం, పెద్దముప్పారం గ్రామానికి చెందిన తెలంగాణ* *ఉద్యమకారుడు శ్రీ ఈదురు జనార్దన్ గారు ఇటీవల స్వర్గస్థులయ్యారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు అక్షర ,భారతి ,మన్వి ఉన్నారు.* *జనార్దన్ గారి మరణంతో కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితులను తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారు, ఆ కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించారు.* *ఈ సందర్భంగా కేటీఆర్ గారు జనార్దన్ గారి కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి, వారిని పరామర్శించి, ధైర్యం చెప్పారు. కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భవిష్యత్ లో అడబిడ్డలకు ఉద్యోగు కల్పనకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.* *ఈ నేపథ్యంలో, జనార్దన్ గారి ముగ్గురు కుమార్తెల భవిష్యత్తుకు భరోసా కల్పించే ఉద్దేశంతో, జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున మొత్తం రూ.9 లక్షల ఆర్థిక సహాయాన్ని బ్యాంక్ బాండ్ల రూపంలో అందించారు మరియు వారి సతీమణి ఈదురు మల్లిక గారికి 1 లక్ష రూపాయలు నగదు వారి కుటుంబ ఖర్చుల నిమిత్తం అందజేశారు…* ఈ సందర్భంగా దివంగత తెలంగాణ ఉద్యమకారుడు శ్రీ ఈదురు జనార్దన్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులతో కొంతసేపు ఆత్మీయంగా మాట్లాడి, వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన *భారాస_పార్టీ_జిల్లా_అధ్యక్షులు* *మహబూబాబాద్_మాజీ_పార్లమెంట్_సభ్యులు* *కవిత_మాలోత్* మాజీ మంత్రులు రెడ్యా నాయాక్ గారు సత్యవతి రాథోడ్ గారు మాజీ జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు BRS నాయకులు మల్లారెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షులు వేణు గారు వీరబోయిన కిషోర్ గారు పొన్నాల ఉమేష్ గారు జనార్దన్ గారు సంజీవ రావు గారు హరీష్ రావు గారు లింగమల్లు గారు మిడతాపల్లి వెంకన్న తదితరులు…. ఈ సందర్భంగా మాజి ఎంపీ కవిత గారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల త్యాగాలను గుర్తుంచుకుంటూ, వారి కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలవడం బీఆర్ఎస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనం అని అన్నారు… ఉద్యమకారుల త్యాగాలకు గౌరవం.. వారి కుటుంబాల భవిష్యత్తుకు భరోసా!









