संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल

Tag: pavanarmy59

ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి

భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు జన్మదిన వేడుకలు

🎉 భీమవరం ఎమ్మెల్యే & PAC చైర్మన్ శ్రీ పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. 📍 వేదిక: శ్రీ కృష్ణ దేవరాయ కళ్యాణ మండపం, భీమవరం🕘 సమయం: ఉదయం 9 గంటలకు📅 తేదీ: 30-05-2026 🌸 బొకేలు వద్దు ❌📚 నోటుబుక్కులు ముద్దు ✅ పూర్తి వివరాలు 👉 https://bpknewsofficial.blogspot.com/ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) చైర్మన్ మరియు భీమవరం శాసనసభ్యులు. *శ్రీ పులపర్తి రామాంజనేయులు ( అంజిబాబు ) గారి జన్మదిన వేడుకలను కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కలసి అంగ రంగ వైభవంగా నిర్వహించుకుందాము. తేదీ: 30.05.2026 శనివారం. సమయము : ఉదయం 9 గంటలకు. వేదిక : శ్రీ కృష్ణ దేవరాయ కళ్యాణ మండపం బ్యాంక్ కాలనీ నందు నిర్వహించడం జరుగుతుంది. కావున భీమవరం నియోజకవర్గం జనసేన – తెలుగుదేశం – బిజెపి కూటమి – ప్రజా ప్రతినిధులు, నాయకులు -కార్యకర్తలు – వీర మహిళలు – తెలుగుమహిళలు – ప్రభుత్వ అధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మన భీమవరం నియోజవర్గ ప్రజలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. *ముఖ్య గమనిక *బొకేలు వద్దు ❌ నోటుబుక్కులు ముద్దు ✅ పుట్టినరోజు సందర్భంగా MLA గారిని కలవడానికి వచ్చే వారందరూ పూలమాలలు, శాలువాలు, బొకేలు బదులుగా నిరుపేద పిల్లల చదువుకు ఉపయోగపడే పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, పెన్నులు లాంటి వస్తువులు తీసుకొని రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. ఇట్లు శాసన సభ్యులు వారి కార్యాలయం భీమవరం

Featured News Updates పశ్చిమ గోదావరి

ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత రాజధానిగా అమరావతి .. ఎమ్మెల్యే అంజిబాబు

ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత రాజధాని అమరావతి అని, 5 కోట్ల ప్రజల ఆకాంక్ష .. అమరావతి అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్ లో గురువారం రాత్రి కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు, పట్టణ ప్రజలతో సంబరాలను నిర్వహించారు. బాణా సంచా కాల్పులతో .. జై అమరావతి.. జై జై అమరావతి నినాదాలతో ప్రకాశం చౌక్ సెంటర్ అంతా మారుమ్రోగింది. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవం రాజధాని అమరావతి అని, ఇది ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. లోక్‌ సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవమన్నారు. అమరావతి ఇక అజేయం, అజరామరమని, స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఇది ఓ కీలక మైలురాయి అని అన్నారు. ఇది రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు, రైతుల త్యాగాలకు (33,000 ఎకరాల భూసమీకరణ) దక్కిన చారిత్రాత్మక విజయమని అన్నారు. వైసీపీ నాయకులు ఏదో చేస్తామంటే ఏమి మారాదని, శాశ్వత రాజధాని అమరావతి అని అన్నారు. రాజ్యసభ మాజీ సభ్యురాలు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ అమరావత్ రాజధానిగా ఎన్నికవడం శుభ సూచకమని, జై అమరావతి అని అన్నారు. అంధకారంలో పడిన అమరావతి భవిష్యత్‌ ఇక దేదీప్యమానంగా ప్రకాశించేందుకు మార్గం సుగమమైందని, ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు లోక్‌ సభ ఆమోదం తెలిపిందన్నారు. అనంతరం జై అమరావతి జై జై అమరావతి అంటూ నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో వివిధ కార్పోరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు.

పశ్చిమ గోదావరి

ప్రైవేటు పాఠశాలల్లోనూ వ్యాయామ విద్య

ప్రైవేటు పాఠశాలల్లోనూ వ్యాయామ విద్య ▪️ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ ప్రైవేటు పాఠశాలల్లో వ్యాయామ విద్య నేర్పించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా యోగా, ఆరోగ్య విద్య, డ్రిల్, క్రీడలు నిర్వహించాలని సూచించింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రతి తరగతికీ వారానికి ఆరు పీరియడ్లను ప్రత్యేకంగా వ్యాయామానికి కేటాయించాలని, ప్రతి విద్యార్థికీ రోజుకు కనీసం ఒకగంట శారీరక శ్రమ ఉండేలా చూడాలని ఆదేశించింది. పాఠశాల అసెంబ్లీలో ప్రతి రోజూ పది నిమిషాలు ధ్యానం, వారానికి ఒక పీరియడ్ను నిర్దేశించిన సిలబస్ మేరకు ఆరోగ్య విద్యకు కేటాయించాలని సూచించింది. ఈ మేరకు కాల నిర్ణయం పట్టికను విడుదల చేసింది.

anji 2
Blog పశ్చిమ గోదావరి

20 మందికి లబ్ధిదారులకు రూ 21 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్

భీమవరం : ఆపదలో ఉన్నవారికి అభయ హస్తంలా సీఎం రిలీఫ్ ఫండ్ ఉపయోగపడుతుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. బుధవారం భీమవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ 20 విడతలో 20 మంది లబ్ధిదారులకు రూ 21,31,462 చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. ఇప్పటికి వరకు భీమవరం నియోజకవర్గంలో 321 మందికి రూ 2,90,48,358 లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించామన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు పాల్గొన్నారు.

Featured విద్య విజ్ఞానం హెల్త్ టిప్స్

ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోండి

మొత్తం ఆహారాలను నొక్కి చెప్పండి: ప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు మరియు లీన్ ప్రొటీన్‌ల వంటి మొత్తం ఆహారాలను ఎంచుకోండి. ఉప్పు మరియు చక్కెరను పరిమితం చేయండి: అధిక ఉప్పు తీసుకోవడం రక్తపోటును పెంచుతుంది, అధిక చక్కెర ఊబకాయం మరియు దంత క్షయంతో ముడిపడి ఉంటుంది. కొవ్వు తీసుకోవడంపై శ్రద్ధ వహించండి: చేపలు, అవకాడోలు మరియు గింజలలో కనిపించే అసంతృప్త కొవ్వులకు, కాల్చిన మరియు వేయించిన ఆహారాలలో కనిపించే సంతృప్త మరియు ట్రాన్స్-కొవ్వులకు ప్రాధాన్యత ఇవ్వండి. భాగాన్ని నియంత్రించండి: చిన్న ప్లేట్లను ఉపయోగించండి మరియు అతిగా తినకుండా ఉండటానికి మీ శరీరంలోని ఆకలి సంకేతాలను వినండి. రెస్టారెంట్లలో సగం భోజనాన్ని ఇంటికి తీసుకురావడాన్ని పరిగణించండి. రకరకాల రంగుల కూరగాయలు తినండి: వివిధ రంగుల కూరగాయలు వివిధ రకాల పోషకాలను అందిస్తాయి.