संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल

Tag: Festival

మహబూబాబాద్

దసరా: చెడుపై మంచి సాధించిన విజయ ప్రతీక

దసరా: చెడుపై మంచి సాధించిన విజయ ప్రతీక భారతీయ సంస్కృతిలో అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకునే అతిపెద్ద పండుగలలో విజయదశమి (దసరా) ముఖ్యమైనది. ఆశ్వయుజ మాస శుక్ల పక్ష పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రోజులు శరన్నవరాత్రులు జరుపుకుని, పదో రోజున విజయదశమి పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. పండుగ విశేషాలు: • నవరాత్రి ఉత్సవాలు: తొమ్మిది రోజుల పాటు జగన్మాత అయిన దుర్గాదేవిని రకరకాల రూపాల్లో (శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి) అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ముగింపు రోజున అమ్మవారిని ‘రాజరాజేశ్వరి’ దేవిగా కొలుస్తారు. • ఆయుధ పూజ: ఈ రోజున వాహనాలకు, వృత్తి వ్యాపారాలకు సంబంధించిన పనిముట్లకు, యంత్రాలకు పూజలు చేయడం ఆనవాయితీ. • శమీ పూజ (జమ్మి చెట్టు పూజ): విజయదశమి రోజు సాయంత్రం జమ్మి చెట్టుకు పూజ చేసి, ఆ పత్రాన్ని (బంగారంగా భావించి) పెద్దలకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం శుభప్రదంగా భావిస్తారు. “శమీ శమయతే పాపం…” అంటూ జమ్మి చెట్టును దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. పండుగ వెనుక ఉన్న పురాణ గాథలు: • మహిషాసుర మర్దనం: లోకకంటకుడైన మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి దేవతలందరి శక్తులతో దుర్గాదేవి అవతరించింది. తొమ్మిది రోజుల పాటు సాగిన సుదీర్ఘ యుద్ధం తర్వాత, పదో రోజైన విజయదశమి నాడు అమ్మవారు మహిషాసురుడిని వధించి లోకానికి ప్రశాంతతను చేకూర్చింది. • శ్రీరాముని విజయం: ఇదే రోజున మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడు రావణాసురుడిని సంహరించి లంకపై విజయం సాధించాడు. దీనికి గుర్తుగా ఉత్తర భారతదేశంలో ‘రామలీలా’ ఉత్సవాలు నిర్వహించి, రావణుడి కుష్టుబొమ్మలను దహనం చేస్తారు. • పాండవుల అజ్ఞాతవాసం: మహాభారతంలో పాండవులు తమ అజ్ఞాతవాసాన్ని ముగించుకుని, జమ్మి చెట్టుపై దాచిన తమ ఆయుధాలను తిరిగి తీసి, కౌరవులపై విజయ సాధన కోసం ప్రయాణమైన రోజు కూడా ఇదే. దసరా పండుగ కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు. అది మానవాళికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. సమాజంలో అధర్మం ఎంత బలంగా ఉన్నప్పటికీ, అంతిమంగా ధర్మమే జయిస్తుందని ఈ పండుగ నిరూపిస్తుంది. కులమతాలకు అతీతంగా, బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే ఈ విజయదశమి అందరి జీవితాల్లో విజయాలను, సుఖసంతోషాలను నింపాలని ఆశిద్దాం.

మహబూబాబాద్

గ్లోబల్ కేరళ మోడల్ స్కూల్‌లో బతుకమ్మ సంబరాలు

విద్యార్థులు, ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం పాల్గొని సందడి మరిపెడ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని గ్లోబల్ కేరళ మోడల్ స్కూల్‌లో మొదటి రోజు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మలను అందంగా పేర్చి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతిపై ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. పాఠశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం విద్యార్థులతో కలిసి వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు పండుగల ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల ఆటపాటలు, బతుకమ్మ పాటలతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. సంప్రదాయాలను గౌరవిస్తూ సంబరాలను నిర్వహించడం పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు.

విశాఖపట్నం

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వం తీసుకోండి సామాజిక సేవలో భాగ స్వాములు కండి

అధికారులకు పిలుపు నిచ్చిన జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్* విశాఖపట్నం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వం తీసుకోవడం ద్వారా సామాజిక సేవలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులకు పిలుపునిచ్చారు. జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వంపై సూచనలు చేశారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకుని సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రజలకు అవసరమైన సమయంలో సేవలు అందించడంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ, మరింత మంది సభ్యులు చేరేలా అవగాహన కల్పించి సభ్యత్వ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీఆర్వో ఎం. విశ్వేశ్వరనాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

అత్యంత వైభవంగా శ్రీ విజయ దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు: ధర్మకర్త బంగారు లక్ష్మి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో సాగిన ‘ఉడుపురాట’ మహోత్సవం!

విశాఖపట్నం మధురవాడ టైలర్స్ కాలనీలో వేంచేసి యున్న శ్రీ విజయ దుర్గా దేవి అమ్మవారి ఆలయం లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా సాగు తున్నాయి ఆలయ ధర్మకర్త బంగారు లక్ష్మి అంకిత భావం పర్యవేక్షణలో ఈ ఏడాది ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ గరిమెళ్ళ శ్రీకాంత్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారి ‘ఉడుపురాట’ మహో త్సవాన్ని అత్యంత ఘనం గా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా నరసింగరావు-నళిని లక్ష్మణ రెడ్డి-లక్ష్మీ దంపతులచే విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, రక్షాసూత్రధారణ ఉడుపురాట వంటి విశేష పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు పరిసర గ్రామాల ఆరాధ్యదైవం ఆధ్యాత్మిక సంబరం ఆలయ ధర్మకర్త బంగారు లక్ష్మి ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త బంగారు లక్ష్మి మాట్లాడుతూ మధురవాడ పరిసర 14 గ్రామాల ప్రజల ఆరాధ్యదేవత అయిన శ్రీ విజయ దుర్గా దేవి శరన్నవ రాత్రి ఉత్సవాలను ప్రతి ఏటా ఎంతో వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు ఉత్సవాల కాలంలో అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యంగా విశేష అఖండ దీపారాధన, అన్న సమా రాధన ఘటాల ఊరేగింపు కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వ హించనున్నట్లు వివరించారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పసుపు- కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారని బంగారు లక్ష్మి తెలియ జేశారు. తరలివచ్చిన భక్తులు – ప్రముఖులు ధర్మకర్త బంగారు లక్ష్మి నేతృత్వంలో జరిగిన ఈ మహోత్సవంలో ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు బంగారు ప్రకాష్, తెంటు మాధవి, భరణ్, కౌశిక్, కార్తికేయ చురుగ్గా పాల్గొన్నారు అలాగే స్థానిక ప్రముఖ నాయకులు పోతిన శ్రీనివాసు, వంకాయల మారుతి ప్రసాద్, పిల్లా సూరిబాబు, పిల్లా కృష్ణ మూర్తి పాత్రుడు, బెల్లాన పాపారావు, సబ్బవరపు రవితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తులందరికీ బంగారు లక్ష్మి , కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి, అమ్మవారి తీర్థప్రసాదాలు అంద జేశారు భక్తులంతా అమ్మ వారిని దర్శించుకుని ఆధ్యాత్మిక తన్మయత్వం చెందారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

*వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అన్నదాన కార్యక్రమం*

ఆర్పీ కాలనీ లో కోలువైన శ్రీ శ్రీ శ్రీ సౌదత్తి రేణుక ఎల్లమ్మ, ముత్యాల పోచమ్మ దేవాలయంలో వరలక్ష్మీ వ్రతం పర్వదినాన అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ చైర్మన్ భీమయ్య గౌడ్, ధర్మకర్త కృష్ణవేణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉజ్జుడమ్మ కర్రీ పాయింట్ అధినేత శ్రీనివాస్ గౌడ్, చిన్న అమ్ములు, లక్ష్మి, రాంబాబు కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

నాగుల పంచమి శుభాకాంక్షలు తెలియజేసిన గ్రేటర్ హైదరాబాద్ మందుల అధ్యక్షుడు సింగ జోగి వంశీ

— *నాగులపంచమి శుభాకాంక్షలు* 🐍🙏 నాగపంచమి పవిత్ర పర్వదిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హార్దిక శుభాకాంక్షలు. నాగదేవత ఆశీస్సులతో ప్రతి ఇంట సుఖసంతోషాలు, సంతానభాగ్యం, సకాల వర్షాలు కురిసి రైతుల పంటలు సుభిక్షంగా పండాలని మనస్ఫూర్వకంగా కోరుకుంటున్నాము. పాములను రక్షించడం అంటే ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించడమే. పుట్టల వద్ద పాలు పోసి, పూజలు చేసి ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం. అందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాము. *ఇట్లు* *సింగాజోగి వంశీ* అధ్యక్షుడు, జగద్గిరిగుట్ట తెలంగాణ మందుల కుల సంఘం ST పోరాట సమితి, గ్రేటర్ హైదరాబాద్ 🌸🌸