పామూరు: మార్కాపురం జిల్లా పామూరు మండలంలోని ఆల్ఫా లిటిల్ కింగ్డమ్ స్కూల్‌లో నిర్వహించిన 7వ స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్‌లో విద్యార్థి ఆకుపాటి నోహిత్ తన ప్రతిభను చాటుకున్నారు. లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ (జీవులు, నిర్జీవులు) అంశాలపై రూపొందించిన ప్రాజెక్టు వర్క్‌ను ప్రదర్శించి, వాటి గురించి వివరించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడం, వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు తాము నేర్చుకున్న అంశాలను ఆచరణాత్మకంగా వివరిస్తూ, ఇతరుల ముందు ధైర్యంగా మాట్లాడే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో లీడ్ అకడమిక్ అడ్వైజర్ రహమాన్ ఖాన్, ప్రిన్సిపాల్ జయరామిరెడ్డి, ఇన్‌చార్జి బిందు థామస్ పాల్గొన్నారు.
దుత్తలూరు Date :07-10-2026 దుత్తలూరు మండలం నందిపాడు గ్రామంలో పుల్లమ్మ(70) అనే వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. బుధవారం ఉదయం శ్రీరాం నగర్డ్ రోడ్ సమీపంలో మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహం సమీపంలో కారు అవశేషాలు/గుర్తులు ఉన్నట్లు కనిపించడంతో ఆమె మృతి ప్రమాదమా? లేక మరేదైనా కారణమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సంఘటన స్థలానికి చేరుకున్న SI సుభాషిణి దర్యాప్తు చెప్పాట్టారు , ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఉస్మాన్ – పున్నమి రిపోర్టర్, నందిపాడు Uploaded Video:
నెల్లూరు జిల్లా దగదర్తి మండలం దుండిగం గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్ఎంసి ఎన్నికలు జరిగాయి. మండల ఇన్చార్జ్ పమిడి రవికుమార్ చౌదరి ఆదేశాల మేరకు దుండుగం టిడిపి నాయకులు నేలపాటి సుబ్బానాయుడు నియమించిన అభ్యర్థులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చైర్మన్ గా దేవరపాటి మాధురి ఎన్నికయ్యారు మరియు ఇదే గ్రామ పంచాయతీలోని మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల చైర్మన్ గా దేవరపాటి నరేష్ మరియు వైస్ చైర్మన్ గా ఉసురుపాటి మహేంద్ర ఎన్నికయ్యారు. ఎన్నికల విషయం గురించి మండల ఇన్చార్జి మాట్లాడుతూ నేలపాటి సుబ్బానాయుడు విద్యార్థుల కు మరియు వారి తల్లిదండ్రులకు మౌలిక వసతులు కల్పించి ఎన్నికలు సజావుగా జరిగేలా చేపట్టారని తెలిపారు. ఈ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఉసురుపాటి సుధాకర్, దేవరపాటి అశోక్, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
దగదర్తి మండల పరిధిలోని లైన్స్ నగర్ జాతీయ రహదారి వద్ద 30-09-2026 తేదీన రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. దగదర్తి పోలీస్ ఎస్సై మహేంద్ర సమాచారం అందిన వెంటనే ప్రమాద స్థలానికి రావటం జరిగింది. ఎస్ఐ గారు ఇచ్చిన సమాచారాలు మేరకు నెల్లూరు నుంచి కావలి వైపుగా వెళుతూ ముందు ఆగి ఉన్న బస్సును ఢీ కొన్న లారీ డ్రైవర్ ఒబ్బన హలీ గా తెలిపారు ఇతను కర్ణాటక చెందిన వ్యక్తిగా ఇతను వయసు 48 సంవత్సరాలు ఉంటుందని ఎటువంటి ప్రాణం నష్టం జరగలేదని చిన్నపాటి గాయాలతో బయటపడ్డారని చెప్పారు. తర్వాత 108 ఫోన్ చేసి చికిత్స నిమిత్తం హాస్పటల్ కి తరలించారు. ఇంకా వివరాలు తెలియాలి.
కావలిలో వెలసిన కలుగోళ్ల శాంభవి అమ్మవారి ఆలయంలో నిర్వహించనున్న శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహోత్సవాల ఏర్పాట్లపై నిర్వాహకులతో చర్చించారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రాధాకృష్ణ, ఆలయ సిబ్బంది, నిర్వాహకులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కావలి పట్టణ ముసునూరు 15వ వార్డు నెల్లూరు పార్లమెంట్ తెలుగు రైతు ఉపాధ్యక్షులు బొట్లగుంట శ్రీహరి నాయుడు గారి కుమారుడు మా అన్న బో ట్లగుంట శశిధర్ గారు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు చదువుల తల్లి సరస్వతి దేవి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో దంచికొట్టిన వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వాయుగుండం తీరం దాటినా ఉత్తరాంధ్రలో వాగులు, నదులు ప్రమాదకరంగా పొంగి పొర్లుతున్నాయి. ఈ వర్షాలతో కొంత మేర రిలీఫ్ దక్కింది ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలతో కాలువలు పొంగి ప్రవహించాయి. వాగులు, నదులు ప్రమాద కరంగా పొంగి పొర్లుతున్నాయి. దీంతో.. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అయింది. ఇదే టైం లో ఐరోపా వాతావరణ సంస్థ ఈ నెలాఖరున మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని తాజా అంచనాగా వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచి కొట్టాయి. ఉత్తరాంధ్ర జిల్లా ల పైన ఎక్కువ ప్రభావం పడింది. నదులు ప్రమాద కరంగా పొంగి పొర్లుతున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి ఈ సీజన్‌లోనే తొలిసారి అత్యధిక వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజ్ 70 గేట్లలో 65 గేట్లను అడుగు మేర ఎత్తి 47 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సిక్కోలు జిల్లాలో నాగావళి ఉగ్రరూపం దాల్చింది. పాలకొండ మండలంలో నదీతీర గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అన్నవరం చుట్టూ నీటిని తీసేయడం కోసం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించారు. భారీ వర్షాలు.. వరదల వేళ ప్రభుత్వ సహాయక చర్యల పైన సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసారు. అన్ని రకాలుగా అండగా నిలవాలని సూచించారు. 28న అల్ప పీడనం ఏర్పడే అవకాశం కాగా, దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర పరిసరాల నుంచి తీవ్ర వాయుగుండం ఉత్తర వాయవ్యంగా పయనించి శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారింది. అదే విధంగా రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా, ఉత్తర థాయ్‌లాండ్ పరిసరాల్లో ఈనెల 28 తరువాత ఉపరితల ఆవర్తనం ఆవరిస్తోందని, దీని ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐరోపా వాతావరణ సంస్థ అంచనా వేసింది. ప్రస్తుత వాయుగుండం పూర్తిగా బలహీనపడ్డాక ఉత్తర, మధ్యభారతం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తాయని వెల్లడించారు. వచ్చే నెల రెండో వారంలో బంగాళాఖాతంలో తుఫాన్‌కు అవకాశం ఉందని బంగ్లాదేశ్‌కు చెందిన సైక్లోన్‌మన్ అంచనా వేశారు. అయితే, ఈ అంచనాలతో ఉత్తరాంధ్ర జిల్లాల పైనే ప్రభావం ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా దగదర్తి గ్రామ కొత్తూరులో నిర్వహించిన గణనాధుని నిమజ్జన కార్యక్రమం లడ్డు వేలం పాటలో (గణ నాధుని మహాప్రసాదం) 95000₹ లకి లడ్డుని దక్కించుకున్న దగదర్తి గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు వర్ధినేని కృష్ణ మరియు గ్రామస్తులు పాలుగోన్నారు.
సంగం మండలం/ సెప్టెంబర్ 22,పున్నమి ప్రతినిధి (ముత్యాల గిరి ) నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠషాలైన సంగం మండలం తరుణవాయి గ్రామం నందు కొట్లూరు వీరచంద్రారెడ్డి జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుమారుడైన కొట్లూరు శేషారెడ్డి గారు ఆరో తరగతి నుంచి పదో తరగ తుల విద్యార్థుల ప్రతిభకు నగదు ప్రోత్సాహం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి మేనత్త గారైన తంబూరు గిరిజమ్మ గారు మరియు డేగ కృష్ణయ్య గారు హాజరు కావటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులైన ch. శ్రీనివాసులు గారి అధ్యక్షతన ప్రార్థనాగీతంతో కార్యక్రమం ప్రారంభమైనది. తరువాత ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ నగదు ప్రోత్సాహం అందిస్తున్న కొట్లూరు శేషారెడ్డి గారి గొప్పతనం గురించి మరియు గాయత్రి కన్స్ట్రషన్ సంస్థ కు వైస్ చైర్మన్ స్థాయికి ఎదిగిన తీరును విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. తర్వాత ముఖ్య అతిథి అయిన కొట్లూరు శేషారెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థులందరూ చదువుతో పాటు క్రమశిక్షణ కలిగి ఉన్నత స్థాయికి ఎదిగి భవిష్యత్తులో ముందుకు సాగాలని తెలియజేయడం జరిగింది. ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రథమ మరియు ద్వితీయ స్థానంలో ప్రతిభ చూపిన విద్యార్థుల కు నగదు ప్రోత్సాహాలు కింద రూ 48000/-లు అందించటం జరిగింది. చివరగా పాఠశాల తరఫున ప్రధానోపాధ్యాయు మరియు విద్యార్థులు కొట్లూరు శేషారెడ్డి గారిని మరియు తంబూరు గిరిజమ్మ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.. దగదర్తి ఎస్ఐ మహేంద్ర. పున్నమి ప్రతి నిది ముత్యాల గిరి దగదర్తి: ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని దగదర్తి ఎస్సై మహీంద్ర సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకపోవడం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, ద్విచక్ర వాహనం నడిపే సమయంలో హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాల సమయంలో తలకు తీవ్ర గాయాలు కాకుండా రక్షణ పొందవచ్చని ఎస్సై తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, తమ భద్రతతో పాటు ఇతరుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాలని వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. “హెల్మెట్ భారంగా కాదు.. మన ప్రాణాలకు రక్షణ కవచం” అని ఎస్సై మహేంద్ర ప్రజలకు అవగాహన కల్పించారు.