संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल

Tag: పొలిటికల్

ఖమ్మం

దివ్యాంగుడు వెంకన్నకు ట్రై సైకిల్ అందజేత. పాల్గొన్న బిజెపి నేత కొండపల్లి శ్రీధర్ రెడ్డి.

ముదిగొండ / ఖమ్మం ముదిగొండ మండలం మాధాపురం గ్రామంలో దివ్యాంగుడు వెంకన్నకు ట్రై సైకిల్ అందజేసే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ మాజీ కిసాన్ మోర్చా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్, బీజేపీ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డితో పాటు గ్రామ బీజేపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దివ్యాంగుడు వెంకన్నకు ట్రై సైకిల్‌ను అందజేసి, అతని అవసరాలకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా కొండపల్లి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, దివ్యాంగులకు సహాయం అందించడం అభినందనీయమన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాన్ని చేపట్టిన వేణుగోపాల్ రెడ్డి, గ్రామ బీజేపీ కుటుంబ సభ్యులను ఆయన హృదయపూర్వకంగా అభినందించారు. భవిష్యత్తులోనూ ప్రజాసేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు.

ఖమ్మం

కిసాన్ మోర్చా నూతన కమిటీ ని ప్రకటించిన కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నరకుళ్ళ వెనకటేశ్వరరావు.

ఖమ్మం జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా నూతన కమిటీని జిల్లా అధ్యక్షులు నారకుళ్ల వెంకటేశ్వరరావు శుక్రవారం ప్రకటించారు. నూతన కమిటీలో చోటు దక్కిన నాయకులకు బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, రైతుల సమస్యల పరిష్కారానికి కిసాన్ మోర్చా నాయకులు కృషి చేయాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో రైతులకు వివరించాలని అన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. నూతన కమిటీతో ఖమ్మం జిల్లాలో కిసాన్ మోర్చా మరింత బలోపేతం అవుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఖమ్మం

ఖమ్మం జిల్లా మహిళా మోర్చా నూతన కమిటీ ప్రకటన..

బీజేపీ ఖమ్మం జిల్లా మహిళా మోర్చా నూతన కమిటీని జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మంద సరస్వతి శుక్రవారం ప్రకటించారు. పార్టీని మరింత బలోపేతం చేసేలా మహిళా నాయకులు, కార్యకర్తలకు కమిటీలో ప్రాధాన్యం కల్పించినట్లు తెలిపారు. నూతనంగా ఎంపికైన కమిటీ సభ్యులకు బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహిళా మోర్చా ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

ఖమ్మం

విద్యార్థులే దేశ భవిష్యత్తు: డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు

ఎర్రుపాలెం / ఖమ్మం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలపురం గ్రామంలోని SJKRM జూనియర్ కాలేజ్ విద్యార్థుల ఆధ్వర్యంలో బాలాజీ భవన్ ఫంక్షన్ హాల్‌లో స్టూడెంట్ ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ రక్ష హాస్పిటల్ అధినేత, భారతీయ జనతా పార్టీ తెలంగాణ కార్యవర్గ సభ్యులు శ్రీ గోంగూర వెంకటేశ్వర్లు (డాక్టర్ జి.వి.) హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. నూతనంగా కళాశాలలో అడుగుపెట్టిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ జి.వి., విద్యార్థి దశలో క్రమశిక్షణతో మెలగుతూ కష్టపడి చదివి, స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. విద్యతో పాటు మంచి విలువలు, సేవా భావం, సమాజం పట్ల బాధ్యతను పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో SJKRM కాలేజ్ ఫౌండర్ గంధం సత్యనారాయణ, ప్రిన్సిపల్ నాగిరెడ్డి సౌజన్య, మేనేజ్మెంట్ మిరియాల శ్యాం ప్రసాద్, గజ్జల శ్రీనివాస్, గంజర్ల శ్రీకాంత్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. “నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు. విద్యతో ఎదిగి.. విలువలతో నిలిచి.. సమాజానికి సేవ చేయాలి” అని వక్తలు ఆకాంక్షించారు.

ఖమ్మం

బాలాజీనగర్ పాఠశాల ఘటనపై బీజేపీ జిల్లా మాజీ ఏద్యుకేషన్ సెల్ కన్వీనర్ ఆచంటి కోటేశ్వరరావు ఆవేదన

ఖమ్మం నగరంలోని బాలాజీనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల జరిగిన ఘటనపై బీజేపీ జిల్లా ఎడ్యుకేషన్ సెల్ మాజీ కన్వీనర్ ఆచంటి కోటేశ్వరరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో జరిగిన ఘటనకు సంబంధించి మండల విద్యాశాఖ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారులు బాధ్యత వహించకుండా కేవలం విచారణకే పరిమితం కావడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ఘటనపై స్పందించిన మండల విద్యాశాఖ అధికారి విచారణ చేపడుతున్నామని మాత్రమే చెప్పారని, అయితే ఘటనకు బాధ్యత ఎవరిది? బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదని కోటేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి సైతం ఈ విషయంపై స్పందించకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ఫోన్‌లకు కూడా స్పందించకుండా బిజీగా ఉన్నారని ఆరోపించారు. “బాలాజీ నగర్ పాఠశాలలో జరిగిన ఘటన వెనుక ఎవరున్నారు? అధికారుల నిర్లక్ష్యానికి కారణమేంటి?” అని ఆచంటి కోటేశ్వరరావు ప్రశ్నించారు. విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశాల్లో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఖమ్మం

రైతుల ఐక్యతే బీకేఎస్ లక్ష్యం

ఖమ్మం: భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దగోపతి గ్రామంలో రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతుల సమస్యలు, వాటి పరిష్కారానికి రైతుల ఐక్యత ఆవశ్యకతపై విస్తృతంగా చర్చించారు. భారతీయ కిసాన్ సంఘ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీ పగడవరపు శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి శ్రీనివాస్ రావు, జిల్లా కార్యదర్శి శ్రీ తూము అప్పారావు, జిల్లా కోశాధ్యక్షుడు శ్రీ నరేష్ పాల్గొన్నారు. రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే ముందుగా రైతులు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని సమావేశంలో పేర్కొన్నారు. గ్రామ గ్రామాన రైతులు ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ, రైతులుగా మాత్రం ఒక్కటై తమ సమస్యలను గుర్తించి, వాటిని సమిష్టిగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ రైతుల సమస్యల విషయంలో అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. రైతుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని నాయకులు తెలిపారు. ప్రతి గ్రామంలో రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా రైతులను సంఘటితం చేయడమే భారతీయ కిసాన్ సంఘ్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రైతుల ఐక్యతతోనే సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.

ఖమ్మం

రోడ్డు పక్కన పూజా సామగ్రి అమ్మితే చర్యలెందుకు?

ఖమ్మం: శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం నేపథ్యంలో ఖమ్మం నగరము లోని స్థానిక SR&BGNR కాలేజీ దగ్గర పూర్తి గా రోడ్డుపక్కన పూజా సామగ్రి అమ్ముకుంటున్న చిరు వ్యాపారులపై ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవడంపై బీజేపీ ఖమ్మం టూ టౌన్ అధ్యక్షుడు ధనియాకుల వెంకట్ నారాయణ ప్రశ్నించారు. పండుగ సందర్భంగా చిన్న వ్యాపారులు ఉపాధి పొందేందుకు ఏర్పాటు చేసుకున్న దుకాణాలపై చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. అదే సమయంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, వాణిజ్య సముదాయాల ముందు ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలు పోలీసులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చిన్న వ్యాపారులపై నిబంధనలు కఠినంగా అమలు చేసే పోలీసులు, భారీ ట్రాఫిక్‌కు కారణమవుతున్న పెద్ద షాపింగ్ మాల్స్ విషయంలోనూ సమానంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. చిరు వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ స్థలాలు కల్పించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని కోరారు.

ఖమ్మం

భద్రాచలం వరకు రైలు మార్గం విస్తరించాలి: వద్దిరాజు రవిచంద్ర

సికింద్రాబాద్ / ఖమ్మం సికింద్రాబాద్ రైల్వే నిలయంలో గురువారం జరిగిన దక్షిణ మధ్య రైల్వే (S.C.R) జోనల్ సమావేశంలో బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్రమూర్తి కొలువైన భద్రాచలం వరకు రైలు మార్గాన్ని నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. భద్రాచలం నుంచి రైలు మార్గాన్ని ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అనుసంధానించే కూడలిగా అభివృద్ధి చేయాలని కోరారు. ఈ ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు భద్రాచలం, ఉమ్మడి ఖమ్మం ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. అలాగే రైల్వేకు సంబంధించిన మరికొన్ని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు వద్దిరాజు రవిచంద్ర అందజేశారు.

ఖమ్మం

సత్తుపల్లిలో మంత్రి పొంగులేటి, మట్టా దయానంద్ విజయ్ కుమార్ ల పర్యటన…

సత్తుపల్లి/ఖమ్మం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్తో కలిసి గురువారం సత్తుపల్లి పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి, పార్టీ కార్యక్రమాలతో పాటు పరామర్శల్లో పాల్గొన్నారు. మున్సిపల్ కౌన్సిలర్ తోట సుజలారాణి-గణేష్ నివాసంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. CSI చర్చ్ రోడ్డులో సత్తుపల్లి నియోజకవర్గ NSUI అధ్యక్షుడు అర్వపల్లి సందీప్ గౌడ్ మాతృమూర్తి ఇటీవల మృతిచెందడంతో వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాకర్లపల్లి రోడ్డులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చల్లగుళ్ల నరసింహారావును కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు, AMC చైర్మన్ దోమ ఆనంద్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుబ్బారెడ్డి, పట్టణ అధ్యక్షుడు గాదె చెన్నారావు, కౌన్సిలర్ తోట సుజలారాణి గణేష్, NSUI అధ్యక్షుడు సందీప్ గౌడ్, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

ఖమ్మం

విద్య, వైద్య రంగాలకు పెద్దపీట..మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.సత్తుపల్లిలో రూ.1.83 కోట్ల పనులకు శ్రీకారం

సత్తుపల్లి / ఖమ్మం సత్తుపల్లి: విద్య, వైద్య రంగాల బలోపేతంతో పాటు మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యమిస్తోందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తో కలిసి సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ.1.83 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఎన్టీఆర్ నగర్‌లో రూ.1.43 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన నూతన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. పట్టణ పేదలకు నాణ్యమైన ఉచిత ప్రాథమిక వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. శివసాయి నగర్‌లో రూ.40 లక్షల నిధులతో నిర్మించనున్న మల్టీపర్పస్ మున్సిపల్ కమ్యూనిటీ హాల్ పనులకు భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. సామాజిక కార్యక్రమాలు, శుభకార్యాలకు కమ్యూనిటీ హాల్ ఉపయోగపడుతుందని తెలిపారు. విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.