ఎలక్ట్రానిక్స్ ధరలకు మళ్లీ రెక్కలు
అక్టోబర్ 1 నుంచి ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు, ఎల్‌ఈడీ టీవీల ధరలు పెరగనున్నాయి. ప్రముఖ కంపెనీలు 3 నుంచి 8 శాతం వరకు ధరలు సవరించేందుకు సిద్ధమవుతున్నాయి. రాగి, అల్యూమినియం, స్టీల్, క్రూడ్ ఆయిల్ ఆధారిత ముడిసరుకుల ఖర్చులు, రవాణా వ్యయం, కరెన్సీ ఒడిదుడుకులు మార్జిన్లపై ఒత్తిడి పెంచుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పండుగ సీజన్ కొనుగోళ్లకు ముందే ఈ పెంపు వినియోగదారుల బడ్జెట్‌పై అదనపు భారంగా మారే అవకాశం ఉంది. ఏసీల ధరలు ముఖ్యంగా ఎక్కువగా పెరగవచ్చని సమాచారం.


