Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గాంధీజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం

నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్‌లో మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ పోషించిన కీలక పాత్రను స్మరించుకున్నారు. అహింస, సత్యాగ్రహం ద్వారా ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. సత్యం, అహింస, ధర్మం, స్వచ్ఛత, క్రమశిక్షణ, సమాజ సేవ వంటి విలువలు నేటి తరానికి ఎంతో అవసరమన్నారు. పేదలు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేయడం ద్వారా గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గాంధీజీ ఆశయాలను జీవితంలో ఆచరించడమే ఆయనకు నిజమైన నివాళి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *