खबर की मुख्य बातें
- కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీఆర్‌ఎస్ శ్రేణులు నిర్మల్, అక్టోబర్ 10 (పున్నమి ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటు జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాల దశాబ్ది ఉత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు.
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
- ఈ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు.
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీఆర్‌ఎస్ శ్రేణులు
నిర్మల్, అక్టోబర్ 10 (పున్నమి ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటు జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాల దశాబ్ది ఉత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో పరిపాలన ప్రజలకు మరింత చేరువైందని, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు మార్గం సుగమమైందని పార్టీ నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్వీ జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్, నాయకుడు మొహమ్మద్ మిన్హాజ్‌తో పాటు పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనడంతో జిల్లాల దశాబ్ది ఉత్సవాలు సందడిగా జరిగాయి.
కార్యక్రమం స్థలాన్ని స్పష్టంగా చేర్చండి