*రాజమహేంద్రవరం:* భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమితులైన కోనసీమ ముద్దుబిడ్డ, జాతి నాయకుడు రామ్ మాధవ్ కు రాజానగరం భారతీయ జనతా పార్టీ మాజీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
చిన్నప్పటి నుంచి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో స్వయంసేవకుడిగా ఎదిగి, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ అనుభవం కలిగిన రామ్ మాధవ్ నియామకం పార్టీకి ఎంతో శక్తినిస్తుందని కొనియాడారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, గొప్ప దేశభక్తులైన రామ్ మాధవ్ జమ్ము కాశ్మీర్ ను భారత్ లో విలీనం చేసే ప్రక్రియలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
కోనసీమ నుండి జాతీయ స్థాయికి ఎదిగిన రామ్ మాధవ్ నియామకం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆశయాలను, పార్టీ సిద్ధాంతాలను దేశమంతా బలంగా ముందుకు తీసుకెళ్లడంలో రామ్ మాధవ్ అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడంలో ఆయన మార్గదర్శకత్వం కీలకంగా ఉంటుందని వీరన్న చౌదరి తెలిపారు