Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

గండిపోచమ్మ సన్నిధిలో వైభవంగా ఆషాఢ మాస మొదటి శుక్రవార కుంకుమార్చనలు

కొవ్వూరు పున్నమి న్యూస్ ప్రతినిధి
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో వేంచేసియున్న ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం మాతృశ్రీ గండిపోచమ్మ అమ్మవారి సన్నిధిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వాహణఅధికారిణి ఆధ్వర్యంలో ఆషాఢ మాస మొదటి శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. పవిత్రమైన ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలో భక్తుల సందడి నెలకొంది.

విశేష అలంకరణ – సామూహిక కుంకుమార్చనలు:
శుక్రవారం ఉదయం అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకాలు, సుగంధ ద్రవ్యాలతో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పసుపు, కుంకుమలు, పట్టువస్త్రాలు మరియు రంగురంగుల పుష్పాలతో నయనానందకరంగా అలంకరించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సామూహిక కుంకుమార్చన పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తమ కుటుంబాలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

భక్తులకు తీర్థప్రసాద వితరణ:
ఆషాఢ మాస మొదటి శుక్రవారం కావడంతో స్థానిక భక్తులతో పాటు పరిసర గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల పూజాదికాలతో, అమ్మవారి నామస్మరణతో మార్మోగింది. పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు, పురోహితులు, ఆసాది ,గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *