5 వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
రామకుప్పం, అక్టోబర్ 10 ( పున్నమి ప్రతినిధి ) :
రామకుప్పం మండలం యానాది కాలనీ, గడ్డురు అటవీ ప్రాంతాల్లో పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. అటవీ ప్రాంతంలో నాటు సారా తయారీకి ఉంచిన 5 వేల లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. రౌడీ షీటర్ల ఇళ్లను తనిఖీ చేసి వారి కార్యకలాపాలపై ఆరా తీశారు. అక్రమ మద్యం తయారీ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని రూరల్ సీఐ మల్లేశ్ యాదవ్, ఎస్ఐ మారెప్ప హెచ్చరించారు.
