సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి – డాక్టర్ పూజిత
రామకుప్పం అక్టోబర్ 10 ( పున్నమి ప్రతినిధి ) :
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజాలాపురం వైద్యాధికారి పూజిత పేర్కొన్నారు శనివారం విదులాపురం పీహెచ్సీ పరిధిలోనున్న హానిగానూరు గ్రామంలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమాన్ని వైద్యాధికారులు పూజిత సాయి శ్రీల ఆధ్వర్యంలోనిర్వహించారు గ్రామంలో సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా జ్వరాలు పై అవగాహన కల్పించారు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు నీరు నిల్వ ఉండడం వల్ల దోమల సంతతి అధికమవుతాయని పేర్కొన్నారు దోమల వల్ల వివిధ రకాల వ్యాధులు ప్రములతాయని సూచించారు ముఖ్యంగా మానసిక వ్యాధుల దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎల్ పి డి పి డి కార్యక్రమంలో పాల్గొని వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఈ కార్యక్రమాన్ని ఎల్పీడీసీడీ స్క్రీనింగ్ చేసి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ బాలయ్య హెల్త్ ఎడ్యుకేటర్ ప్రమీల ఏఎన్ఎం గ్లోరీ మరియు ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
