Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Hyderabad

22ఏ పేరుతో ప్రజల ఆస్తులకు సంకెళ్లు:కేటీఆర్

Punnami Newsroom Published:
22ఏ పేరుతో ప్రజల ఆస్తులకు సంకెళ్లు:కేటీఆర్

Story highlights

  • 22ఏ కింద ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యవహారంపై న్యాయ విచారణ జరపాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.
  • 30 శాతం కమిషన్ల కోసం ప్రజల ఆస్తులతో చెలగాటమాడుతున్నారని ప్రభుత్వంపై ఆరోపించారు.
  • కాలనీలు, అపార్ట్‌మెంట్లు, ఇళ్లను నిషేధిత జాబితా నుంచి బేషరతుగా తొలగించి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు.

22ఏ కింద ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యవహారంపై న్యాయ విచారణ జరపాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. 30 శాతం కమిషన్ల కోసం ప్రజల ఆస్తులతో చెలగాటమాడుతున్నారని ప్రభుత్వంపై ఆరోపించారు. కాలనీలు, అపార్ట్‌మెంట్లు, ఇళ్లను నిషేధిత జాబితా నుంచి బేషరతుగా తొలగించి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు. ధరణి ప్రజల ఆస్తులకు రక్షణ కవచంగా ఉండేదని, ప్రస్తుతం పరిస్థితి ‘భూభారతి కాదు.. భూ హారతి’గా మారిందని విమర్శించారు. అసైన్డ్‌ భూములను రెగ్యులరైజ్‌ చేసి ఎస్సీ, ఎస్టీలకు యాజమాన్య హక్కులు కల్పించాలని కోరారు. ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. రెండేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తుందని, అప్పటి ప్రభుత్వ అక్రమాలన్నింటినీ వెలుగులోకి తెస్తామని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *