संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
विशाखापट्टनम

113వ వార్డులో నాగరాజు ప్రచార జోరు! తుఫాను బాధితులకు పరామర్శ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
113వ వార్డులో నాగరాజు ప్రచార జోరు! తుఫాను బాధితులకు పరామర్శ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

खबर की मुख्य बातें

  • Uploaded Video:

గాజువాక, అక్టోబర్ 28 (పున్నమి ప్రతినిధి):

జీవీఎంసీ 113వ వార్డు స్వతంత్ర అభ్యర్థి చొప్ప నాగరాజు తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాజకీయాలకు అతీతంగా అందరినీ తనవారిగా భావిస్తూ, సౌమ్యంగా ప్రజలతో మమేకమవుతూ ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు ముందుకు సాగుతున్నారు. మరోవైపు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులను పరామర్శించి, వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

వెదుళ్ల నరవ, నంగినారపాడు, గంగవరం, నరవ, సత్తివానిపాలెం, కోట నరవ, గవర జగ్గయ్యపాలెం, బంట కాలనీ తదితర ప్రాంతాల్లో నాగరాజు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల్లో మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలుకుతుండగా, ప్రజలతో మమేకమవుతూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. “ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడమే నా లక్ష్యం. తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను పరామర్శించి వారి పరిస్థితులను తెలుసుకున్నాను. వార్డులోని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. తాగునీటి సమస్యలను పరిష్కరించడంతోపాటు రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తాను. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ సమానంగా చూస్తూ వార్డు అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తాను. ప్రజల ఆశీస్సులతో నన్ను గెలిపించి, ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని కోరుతున్నాను” అని విజ్ఞప్తి చేశారు.

తుఫాను సమయంలోనూ ప్రజల మధ్య ఉంటూ, మరోవైపు ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తూ నాగరాజు తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు.

Uploaded Video:

113వ వార్డులో నాగరాజు ప్రచార జోరు! తుఫాను బాధితులకు పరామర్శ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *