संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
विशाखापट्टनम

స్ట్రాంగ్ రూమ్‌లు, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల పరిశీలన ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రత..

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
స్ట్రాంగ్ రూమ్‌లు, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల పరిశీలన ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రత..

గాజువాక, అక్టోబర్ 28 (పున్నమి ప్రతినిధి):

జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై నగర పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి గాజువాక బీహెచ్‌పీవీ (BHPV), అగనంపూడిలోని స్ట్రాంగ్ రూమ్‌లను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సౌత్ సబ్ డివిజన్ పరిధిలోని హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడి భద్రతా పరిస్థితులను సమీక్షించారు.

ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛగా సాగేందుకు అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ పర్యటనలో డీసీపీ జోన్-II మేరీ ప్రశాంతి, సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ వై. శ్రీనివాసరావు, గాజువాక పోలీస్ స్టేషన్ సీఐ సీహెచ్. వాసు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

స్ట్రాంగ్ రూమ్‌లు, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల పరిశీలన ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రత..

స్ట్రాంగ్ రూమ్‌లు, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల పరిశీలన ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రత..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *