संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
जनगांव

🎶 హరే కృష్ణ నామం నర్తించిన వేదిక – వేదిక్ విద్యార్థుల ఆధ్యాత్మిక అనుభూతి 🎥

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
🎶 హరే కృష్ణ నామం నర్తించిన వేదిక – వేదిక్ విద్యార్థుల ఆధ్యాత్మిక అనుభూతి 🎥

खबर की मुख्य बातें

  • తేదీ: 03-08-2025, ఆదివారం రోజు, వేదిక్ స్కూల్ స్టూడెంట్స్ - జనగామ బృందంగా కలిసి దేవి థియేటర్, జనగామలో ప్రదర్శితమైన "మహావతార్ నరసింహ" సినిమాను వీక్షించారు.
  • ఈ చిత్రం అందరికీ ఆధ్యాత్మికంగా ప్రేరణనిచ్చింది.
  • నరసింహస్వామి అవతారంలో ధర్మ పరిరక్షణ కోసం జరిగే సంఘర్షణ, భక్తి, ధైర్యం పట్ల ఈ సినిమా అందించిన సందేశాలు ప్రతి విద్యార్థి హృదయంలో గాఢంగా నిలిచిపోయాయి.

తేదీ: 03-08-2025, ఆదివారం రోజు, వేదిక్ స్కూల్ స్టూడెంట్స్ – జనగామ బృందంగా కలిసి దేవి థియేటర్, జనగామలో ప్రదర్శితమైన “మహావతార్ నరసింహ” సినిమాను వీక్షించారు. ఈ చిత్రం అందరికీ ఆధ్యాత్మికంగా ప్రేరణనిచ్చింది.

నరసింహస్వామి అవతారంలో ధర్మ పరిరక్షణ కోసం జరిగే సంఘర్షణ, భక్తి, ధైర్యం పట్ల ఈ సినిమా అందించిన సందేశాలు ప్రతి విద్యార్థి హృదయంలో గాఢంగా నిలిచిపోయాయి. మన సంస్కృతి గొప్పతనాన్ని తెలియజేసిన ఈ చిత్రం మరువలేని అనుభూతిని అందించింది.

ఈ సందర్భంగా,
హరే కృష్ణ భక్తబృందం వారు హరినామ సంకీర్తన చేస్తూ, ఎంతో ఉత్సాహంగా సందడిగా నృత్య ప్రదర్శనను కూడా అందించారు. వారి భక్తి, పాటల మాధుర్యం మరియు నృత్యం ప్రేక్షకుల మనసులను ఆకట్టుకున్నాయి.

మేము, వేదిక్ స్కూల్ స్టూడెంట్స్ – జనగామ, ఈ చిత్రం నిర్మాణ బృందానికి, నటీనటులకు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన ప్రతి ఒక్కరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇటువంటి చిత్రాలు యువతలో సంస్కారాలను, భక్తిని పెంపొందించడానికి దోహదపడతాయని మా నమ్మకం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *