Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Tirupati

⛔ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏఐకేఎస్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆర్డీవో ఆఫీస్ ముందు ధర్నా

Punnami Newsroom Published:
⛔ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏఐకేఎస్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆర్డీవో ఆఫీస్ ముందు ధర్నా

Story highlights

  • ⛔రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్డీవోకి వింత పత్రం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏఐకేఎస్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయం ముందు రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం జరిగింది.
  • ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుధాకర్ రెడ్డి సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఇలప నాగేంద్రబాబులు మాట్లాడుతూ ప్రభుత్వాలు రైతాంగం పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నాయని ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రధానంగా సూళ్లూరుపేట రెవెన్యూ డివిషన్లో…
  • దాదాపు 1500 ఎకరాల కు నకిలీ విత్తనాల ద్వారా రైతులు మూడు కోట్ల రూపాయల మేర నష్టపోతే వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు ఇప్పటికీ కూడా వారికి తగిన నష్టపరిహారం అందించలేదని నష్టపోయిన రైతాంగం ఎదురుచూపులు తప్పడం లేదని ఇకనైనా బాధిత రైతాంగానికి నష్టపరిహారం అందేలా చర్యలు…

⛔రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్డీవోకి వింత పత్రం
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏఐకేఎస్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయం ముందు రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుధాకర్ రెడ్డి సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఇలప నాగేంద్రబాబులు మాట్లాడుతూ ప్రభుత్వాలు రైతాంగం పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నాయని ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రధానంగా సూళ్లూరుపేట రెవెన్యూ డివిషన్లో అనేక రైతాంగ సమస్యలు ఉన్నాయని బుచ్చినాయుడు కండిగ మండలం
వి ఎస్ పురం లో సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వలేదని అలాగే సూళ్లూరుపేట రెవిన్యూ డివిజన్ పరిధిలో తెలుగు గంగ చీలు కాలువలను పూర్తి చేయాలని, ఆక్రమణలకు గురైన పంట కాలువలను వెలికితీయాలని కోరారు. దాదాపు 1500 ఎకరాల కు నకిలీ విత్తనాల ద్వారా రైతులు మూడు కోట్ల రూపాయల మేర నష్టపోతే వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు ఇప్పటికీ కూడా వారికి తగిన నష్టపరిహారం అందించలేదని నష్టపోయిన రైతాంగం ఎదురుచూపులు తప్పడం లేదని ఇకనైనా బాధిత రైతాంగానికి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దురాక్రమణ పాలైన నెర్రి కాలువ తన సహజ స్వరూపాన్ని కోల్పోయిందని, సాగునీరు ప్రవహించాల్సిన నెర్రి కాలువలో మురుగునీరు ప్రవహిస్తుందని కాలువ ఆక్రమణలను తొలగించి పరిశుభ్రమైన సాగునీటిని రైతన్నలకు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రమణయ్య శ్రీనివాసులు,ఆనంద్ బాబు ఓ కుమార్ బాలు రజిని చంచమ్మ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *