ಸಂಪರ್ಕಿಸಿ ಇತ್ತೀಚಿನ ಸುದ್ದಿ
ನಿಜವಾದ ಸುದ್ದಿ. ವೇಗವಾದ ಮಾಹಿತಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ • ತೆಲಂಗಾಣ • ರಾಷ್ಟ್ರೀಯ
ಲೇಖಕರ ಪ್ಯಾನೆಲ್
ಡಾ. ಬಿ.ಆರ್. ಅಂಬೇಡ್ಕರ್ ಕೋನಸೀಮ

హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్‌పై ఇంజరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన

ಪುನ್ನಮಿ ನ್ಯೂಸ್‌ರೂಮ್ ಪ್ರಕಟಿತ: ನವೀಕರಿಸಲಾಗಿದೆ:
హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్‌పై ఇంజరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన

ಸುದ್ದಿಯ ಮುಖ್ಯಾಂಶಗಳು

  • L హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో నిర్వహించారు.
  • ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
  • దిశా,బీమాభాయి మహిళా మండలి సహకారంతో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య అంశాలపై మరియు హెచ్ ఐ వి ఎయిడ్స్ మరియు లైంగిక వ్యాధులపై అవగాహనా కార్యక్రమంను నిర్వహించారు.

L

హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దిశా,బీమాభాయి మహిళా మండలి సహకారంతో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య అంశాలపై మరియు హెచ్ ఐ వి ఎయిడ్స్ మరియు లైంగిక వ్యాధులపై అవగాహనా కార్యక్రమంను నిర్వహించారు.
ఈ సందర్భంగా హెచ్‌ఐవీ ఎలా సంక్రమిస్తుంది, ఎలా సంక్రమించదు,హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పట్ల గల అపోహలు, హెచ్‌ఐవీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెచ్‌ఐవీ సోకిన వారికి అందుబాటులో ఉన్న చికిత్సా సేవలు, క్షయ వ్యాధి, డ్రగ్స్ వినియోగం, హెచ్‌ఐవీ బాధితుల పట్ల వివక్షత చూపకూడదనే అంశాలపై అవగాహన కల్పించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్‌కు సంబంధించిన ఉచిత సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే 1097 టోల్‌ఫ్రీ నంబర్, హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్ చట్టం 2017, ఏఆర్‌టీ మందుల కేంద్రాలు తదితర అంశాలపై వివరించారు. విద్యార్థులకు ఐఈసీ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీమాబాయి మహిళా మండలి మండల స్థాయి ఇంప్లిమెంటరు కే శివ శంకర్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *