Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
For Kids

హాస్య కథ

Punnami Newsroom Published:
హాస్య కథ

Story highlights

  • అనగనగా ఒక అడవిలో మూడు చీమలు ఉండేవి .ఒకటి ఎర్రది ,నల్లది ,తెల్లది.ఈ ముగ్గురు ఖాళీగా ఉండడం ఎందుకని అలా అడవిలో తిరుగుదాం అని అనుకొని బయలుదేరారు.కొంచెం దూరం వెళ్లి అలిసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి కోసం ఆగాయి.కొంతసేపటికి తెల్ల చీమకి ఒక సందేహం వచ్చింది.
  • మేము ఒక్కొక్కరం ఒక్కో రంగులు ఎందుకు ఉన్నాము అని.ఇంత తలనొప్పి ఎందుకు నేరుగా వెళ్లి వాళ్ళనే అడుగుదాం అని అనుకొని వెళ్లి ఎర్ర చీమని అడిగింది.
  • నీవు ఎర్రగా ఎందుకు ఉన్నావు మిత్రమా అని అడిగింది .

అనగనగా ఒక అడవిలో మూడు చీమలు ఉండేవి .ఒకటి ఎర్రది ,నల్లది ,తెల్లది.ఈ ముగ్గురు ఖాళీగా ఉండడం ఎందుకని అలా అడవిలో తిరుగుదాం అని అనుకొని బయలుదేరారు.కొంచెం దూరం వెళ్లి అలిసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి కోసం ఆగాయి.కొంతసేపటికి తెల్ల చీమకి ఒక సందేహం వచ్చింది. మేము ఒక్కొక్కరం ఒక్కో రంగులు ఎందుకు ఉన్నాము అని.ఇంత తలనొప్పి ఎందుకు నేరుగా వెళ్లి వాళ్ళనే అడుగుదాం అని అనుకొని వెళ్లి ఎర్ర చీమని అడిగింది. నీవు ఎర్రగా ఎందుకు ఉన్నావు మిత్రమా అని అడిగింది . దానికి ఎర్ర చీమ నేను మనుషుల రక్తాన్ని తాగుతాను అందుకే నేను ఎర్రగా ఉన్నాను అని చెప్పింది. తరువాత నల్ల చీమ వద్దకు వెళ్లి నీవు ఎందుకు నల్లగా ఉన్నావు మిత్రమా అని అడిగింది తెల్ల చీమ. దానికి నల్ల చీమ నేను బురదలో ఉంటాను అందుకే నల్లగా ఉన్నాను అంది. ఇప్పుడు ఎర్ర చీమ మరియు నల్ల చీమ తెల్ల చీమ అని నీవు ఎందుకు తెల్లగా ఉన్నావు మిత్రమా అని అడిగాయి. దానికి తెల్ల చీమ నేను ఎట్ల చీమలాగా మనుషులు రక్తాన్ని తాగను అలాగే నేను నల్ల చీమ లాగా బురదలోను ఉండను నేను రోజు స్నానం చేసి పౌడర్ మరియు ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకుంటాను. అందుకే నేను ఇంత తెల్లగా ఉంటాను అని చెప్పింది తెల్ల చీమ.

మనం తెలుసుకోవలసినది ఏమనగా ఫెయిర్ అండ్ లవ్లీ నీ ఇప్పుడు చీమలు కూడా వాడుతున్నాయి. దీన్నే అంటారు ఫెయిర్ అండ్ లవ్లీ మహత్యం అని😄😄😄😄

కథా రచయిత్రి,
హఫ్సా అంజుమ్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *