Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
BHUPALPALLE

హనుమాన్ నగర్–2 గల్లీలో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

Punnami Newsroom Published:
హనుమాన్ నగర్–2 గల్లీలో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

Story highlights

  • భూపాలపల్లి, అక్టోబర్ 11 (పున్నమి న్యూస్):జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి పట్టణంలోని హనుమాన్ నగర్–2 గల్లీలో ఆడపడుచులు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
  • తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
  • ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు.

భూపాలపల్లి, అక్టోబర్ 11 (పున్నమి న్యూస్):జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి పట్టణంలోని హనుమాన్ నగర్–2 గల్లీలో ఆడపడుచులు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు. బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ నృత్యాలు చేస్తూ పండుగ సందడిని మరింత పెంచారు. గల్లి పరిసరాలు బతుకమ్మ పాటలతో, మహిళల సందడితో పండుగ శోభను సంతరించుకున్నాయి.
తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకల ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంతో పాటు మహిళల మధ్య స్నేహభావం, ఐక్యత మరింత బలపడుతున్నాయని స్థానిక మహిళలు పేర్కొన్నారు.
హనుమాన్ నగర్–2 గల్లీలో నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య కొనసాగడంతో స్థానికంగా పండుగ వాతావరణం నెలకొంది.

– పున్నమి న్యూస్, భూపాలపల్లి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *