Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Palnadu

స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన శ్రీ రామకృష్ణ సేవాసమితి

Punnami Newsroom Published: Updated:
స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన శ్రీ రామకృష్ణ సేవాసమితి

మాచర్ల పట్టణంలోని గుంటూరు రోడ్ లో స్వచ్ఛభారత్. శ్రీ రామకృష్ణ సేవాసమితి మాచర్ల వారీ ఆధ్వర్యంలో 23.08. 2026 ఆదివారం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించినట్లు శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా, గ్రీన్ మాచర్ల స్వచ్ఛ మాచర్ల సంకల్పంతో శ్రీరామకృష్ణ సేవాసమితి మాచర్ల వారి ఆధ్వర్యంలో గత 15 రోజులు క్రితం మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారూ మరియు మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస కళ్యాణ్ మరియు అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రశాంత్ ఆధ్వర్యంలో గుంటూరు రోడ్డులో గల కోర్టు దగ్గర నుండి మార్కెట్ యార్డ్ వరకు రోడ్డుకు రెండువైపులా మొక్కలు నాటినట్లు గోవింద రెడ్డి తెలిపారు. అందులో భాగంగా ఈరోజు బాగాలేని మొక్కలను తీసివేసి ఆ స్థానంలో కొత్త మొక్కలు వేసి వాటికి సపోర్టుగా కర్రలను పెట్టి మాచర్ల మున్సిపల్ కమిషనర్ డి .వేణుబాబు సహకారంతో మున్సిపల్ వాటర్ ట్యాంక్ ద్వారా మొక్కలన్నింటికీ వాటర్ సప్లై చేసినట్లు గోవింద రెడ్డి తెలిపారు. మానవ సేవయే, మాధవసేవ అన్న స్వామి వివేకానంద స్ఫూర్తితో, పరిశుభ్రతలోనే పరమాత్ముడు ఉన్నాడు అన్న మహాత్మా గాంధీ స్ఫూర్తితో, పూజ్యులు, పెద్దలు మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో మరియు పూజ్యులు, పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ప్రభుత్వ ఆఫీసులు, స్కూల్స్, కాలేజీలు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు ఎక్కడ ఆపరిశుభ్రంగా ఉంటే అక్కడ శ్రీరామకృష్ణ సేవాసమితి వారు స్వర్ణాంధ్ర , స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గోవిందరెడ్డి తెలిపారు. కావున మహానుభావులు కలలు కన్నా నవభారత నిర్మాణం జరగాలంటే ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి సభ్యులు ఎర్రబోతుల నాగ శంకర్ రెడ్డి, రాజారావు, సుందరమ్మ, శ్రీనివాసులు , పి .హరిబాబు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన శ్రీ రామకృష్ణ సేవాసమితి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *