Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Prakasam

స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలి – కనిగిరి వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల

Punnami Newsroom Published:

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల అంశం, ఎస్‌ఐఆర్ అంశాలపై న్యాయపరమైన పరిణామాలు కొనసాగుతున్నప్పటికీ, ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చన్న అంచనాతో పార్టీ ముందస్తు సిద్ధత కొనసాగించాలని పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ , జిల్లా పార్టీ అధ్యక్షులు, దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సూచించారని కనిగిరి నియోజకవర్గం వైయస్‌ఆర్‌సీపీ ఇంచార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ బుధవారం పార్టీ కార్యాలయం నుండి పత్రికా ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయదలచిన అభ్యర్థులు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్‌ఓసీలు, పన్నులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని చెప్పారు.అభ్యర్థులు గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేయాలని, దరఖాస్తులు స్వీకరించకపోతే లేదా సర్వర్ పనిచేయకపోతే ఆ పరిస్థితిని వీడియో రూపంలో నమోదు చేయాలని సూచించారు.జిల్లా పార్టీ నేతలతో జిల్లా కలెక్టర్ గారిని కలిసి సమస్యపై వినతిపత్రాలు అందజేద్దామన్నారు.కావున రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలి – కనిగిరి వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల

Leave a comment

Your email address will not be published. Required fields are marked *