Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Warangal

సేవా సంకల్ప్ అభియాన్‌లో విద్యార్థుల సృజనాత్మక ప్రతిభ

Punnami Newsroom Published: Updated:
సేవా సంకల్ప్ అభియాన్‌లో విద్యార్థుల సృజనాత్మక ప్రతిభ

Story highlights

  • ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదిన పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా లక్నెపెల్లిలోని శివాని హైస్కూల్లో విద్యార్థులకు చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు ఘనంగా నిర్వహించారు.
  • బీజేపీ నర్సంపేట రూరల్ అధ్యక్షులు అంబేద్కర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లా కన్వీనర్ డా.
  • గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదిన పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా లక్నెపెల్లిలోని శివాని హైస్కూల్లో విద్యార్థులకు చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ నర్సంపేట రూరల్ అధ్యక్షులు అంబేద్కర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లా కన్వీనర్ డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
​ఈ సందర్భంగా “నరేంద్ర మోదీ – ప్రస్తుత భారతదేశం” అనే అంశంపై విద్యార్థులు డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, అంతరిక్ష విజయాలను చిత్రాల రూపంలోనూ, ఉపన్యాసాల ద్వారా తమ ప్రసంగ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. డా. రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి, సామాజిక బాధ్యత పెంపొందించాలని పిలుపునిచ్చారు.
​అనంతరం విజేతలకు మోతె సమ్మిరెడ్డి, డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, వేములపల్లి సుబ్బారావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కట్ల రామచంద్రారెడ్డి, గూడూరు సందీప్, జూలూరు మనీష్ గౌడ్, అచ్చ దయాకర్, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *