संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
ASIFABAD

సుప్రీం స్వేరో ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహిస్తున్నాం జిల్లా – అధ్యక్షుడు దొంగ్రె సురేష్

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
సుప్రీం స్వేరో ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహిస్తున్నాం జిల్లా – అధ్యక్షుడు దొంగ్రె సురేష్

खबर की मुख्य बातें

  • అక్టోబర్ 18న కాగజ్‌నగర్‌లో నూతన స్వేరో జిల్లా కమిటీ ఎన్నికలు సుప్రీం స్వేరో ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహిస్తున్నాం జిల్లా - అధ్యక్షుడు దొంగ్రె సురేష్ కాగజ్‌నగర్: సుప్రీం స్వేరో ఆదేశాల మేరకు, స్వేరో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ ఆదివారం ఉదయం…
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వేరో సంస్థ బలోపేతానికి, జిల్లాలో సంస్థ కార్యకలాపాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి నూతన జిల్లా కమిటీ ఎన్నికలు కీలకమని పేర్కొన్నారు.
  • రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రస్తుత జిల్లా కమిటీ నాయకులు, మండల కమిటీ నాయకులు, సీనియర్ స్వేరో నాయకులు, సుప్రీం స్వేరో ఆర్‌ఎస్‌పీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

అక్టోబర్ 18న కాగజ్‌నగర్‌లో నూతన స్వేరో జిల్లా కమిటీ ఎన్నికలు

సుప్రీం స్వేరో ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహిస్తున్నాం జిల్లా – అధ్యక్షుడు దొంగ్రె సురేష్

కాగజ్‌నగర్: సుప్రీం స్వేరో ఆదేశాల మేరకు, స్వేరో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ ఆదివారం ఉదయం 10:30 గంటలకు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని ప్రాణహిత నిలయం, కోసిని వద్ద నూతన స్వేరో జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆసిఫాబాద్ జిల్లా స్వేరో కమిటీ అధ్యక్షుడు దొంగ్రె సురేష్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వేరో సంస్థ బలోపేతానికి, జిల్లాలో సంస్థ కార్యకలాపాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి నూతన జిల్లా కమిటీ ఎన్నికలు కీలకమని పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రస్తుత జిల్లా కమిటీ నాయకులు, మండల కమిటీ నాయకులు, సీనియర్ స్వేరో నాయకులు, సుప్రీం స్వేరో ఆర్‌ఎస్‌పీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

సంస్థ లక్ష్యాలు, ఆశయాలకు అనుగుణంగా ఐకమత్యంతో ముందుకు సాగాలని, స్వేరో ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సురేష్ కోరారు. జిల్లా కమిటీ ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమయానికి హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *