संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
ASIFABAD

ఆసిఫాబాద్ జిల్లా నూతన స్వేరో కమిటీ ఎన్నిక

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఆసిఫాబాద్ జిల్లా నూతన స్వేరో కమిటీ ఎన్నిక

खबर की मुख्य बातें

  • జిల్లా అధ్యక్షుడిగా కె.
  • శ్రీనివాస్..
  • ప్రధాన కార్యదర్శిగా గోలేటి నాగేష్ ఎన్నిక విద్యా చైతన్యం, సామాజిక సమానత్వం, యువత అభ్యున్నతికి కృషి చేస్తాం కాగజ్‌నగర్, అక్టోబర్ 18 (పున్నమి ప్రతినిధి): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా స్వేరో సంఘం నూతన జిల్లా కమిటీని ఆదివారం కాగజ్‌నగర్‌లోని ప్రాణహిత నిలయం వేదికగా రాష్ట్ర కమిటీ…

జిల్లా అధ్యక్షుడిగా కె. శ్రీనివాస్.. ప్రధాన కార్యదర్శిగా గోలేటి నాగేష్ ఎన్నిక

విద్యా చైతన్యం, సామాజిక సమానత్వం, యువత అభ్యున్నతికి కృషి చేస్తాం

కాగజ్‌నగర్, అక్టోబర్ 18 (పున్నమి ప్రతినిధి): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా స్వేరో సంఘం నూతన జిల్లా కమిటీని ఆదివారం కాగజ్‌నగర్‌లోని ప్రాణహిత నిలయం వేదికగా రాష్ట్ర కమిటీ అధ్యక్షతన, కొదపక రమేష్ బాబు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా స్వేరో సంఘం నూతన కమిటీని ప్రకటించారు.

స్వేరో ఉద్యమాన్ని జిల్లావ్యాప్తంగా మరింత బలోపేతం చేయడం, విద్యా చైతన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, సామాజిక సమానత్వం కోసం కృషి చేయడం నూతన కమిటీ ప్రధాన లక్ష్యాలుగా నిర్ణయించారు.

నూతన జిల్లా కమిటీ వివరాలు:

గౌరవ అధ్యక్షుడిగా దొంగ్రే సురేష్, జిల్లా అధ్యక్షుడిగా కె. శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా కృష్ణపల్లి సురేష్, దుర్గం రవి, జనరల్ సెక్రటరీగా గోలేటి నాగేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా గొల్లపల్లి ఆనంద్, కుమ్రం మహేష్, కోశాధికారిగా లింగాల గణేష్ ఎన్నికయ్యారు.

అలాగే అధికార ప్రతినిధులుగా మహేందర్, రాజు, జాయింట్ సెక్రటరీలుగా డి. మహేష్, ఏ. హరీష్, కార్యవర్గ సభ్యుడిగా ఓ. ప్రేమానందం, సోషల్ మీడియా ఇన్‌చార్జిగా దుర్గం సాయి కృష్ణ, సభ్యుడిగా కౌషల్ శంకర్‌ను ఎంపిక చేశారు.

స్వేరో ఉద్యమ బలోపేతమే లక్ష్యం

నూతన కమిటీ సభ్యులు జిల్లాలో విద్యా సంబంధిత కార్యక్రమాలను విస్తరించడం, యువతకు సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించడం, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం, సామాజిక అసమానతలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

స్వేరో ఉద్యమ ఆశయాలకు అనుగుణంగా కమిటీ సభ్యులందరూ సమన్వయంతో పనిచేస్తూ, జిల్లాలో సంఘ కార్యకలాపాలను విస్తృతం చేసి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని సంకల్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *