संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

సీఎం చంద్రబాబు ఆదేశాలతో ముందస్తుగా పెన్షన్ల పంపిణీ వీఆర్వో మీరావలి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
సీఎం చంద్రబాబు ఆదేశాలతో ముందస్తుగా పెన్షన్ల పంపిణీ వీఆర్వో మీరావలి

మహిమలూరు:** ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రెండు రోజుల ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం మహిమలూరు పంచాయతీ పరిధిలోని బసవరాజుపాలెం గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.

మహిమలూరు ఎస్సీ కాలనీలో వీఆర్వో మీరావలి స్వయంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛను నగదును పంపిణీ చేశారు. ముందస్తుగానే పింఛన్లు అందడంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం అందిస్తున్న పింఛను సొమ్ము తమ రోజువారీ కుటుంబ అవసరాలకు ఎంతో తోడ్పడుతోందని లబ్ధిదారులు తెలిపారు. నిర్ణీత తేదీ కంటే ముందుగానే పింఛన్లు అందించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, పింఛన్ల పంపిణీలో పాల్గొన్న వీఆర్వో మీరావలికి కృతజ్ఞతలు తెలియజేశారు.

సీఎం చంద్రబాబు ఆదేశాలతో ముందస్తుగా పెన్షన్ల పంపిణీ వీఆర్వో మీరావలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *