Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Kakinada

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (ఏక్తా దివస్) సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించిన కాకినాడ జిల్లా పోలీసులు

Punnami Newsroom Published:
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (ఏక్తా దివస్) సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించిన కాకినాడ జిల్లా పోలీసులు

**kakinada_district_police** సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (ఏక్తా దివస్) సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించిన కాకినాడ జిల్లా పోలీసులు

రానున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (ఏక్తా దివస్) లో భాగంగా కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా పోలీస్ యంత్రాంగం కాకినాడ రోటరీ క్లబ్, యువసేన బ్లడ్ బ్యాంక్ మరియు కాకినాడ జీజీహెచ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు కాకినాడ జిల్లా, కాకినాడ, పోలీస్ కళ్యాణ మండపం వద్ద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

ఉదయం 09.00 గంటల నుంచి మధ్యాహ్నం 02.00 గంటల వరకు నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో కాకినాడ జిల్లాకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ శిబిరంలో మొత్తం 111 మంది రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ గారు మాట్లాడుతూ… ఆపదలో ఉన్నవారికి, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి రక్తం ఎంతో విలువైనదని, ఒక యూనిట్ రక్తదానం చేయడం ద్వారా పలువురి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు.

రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడడంలో భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు వచ్చి, ఆపదలో ఉన్న వారికి తమ వంతు సహాయం అందించాలని ఎస్పీ గారు పిలుపునిచ్చారు.

ఏక్తా దివస్ కార్యక్రమాల్లో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) డాక్టర్ మహంతి కిషోర్ కుమార్ గారు, అడిషనల్ ఎస్పీ (ఏ ఆర్) శ్రీ ఎస్ శ్రీనివాసరావు, ఎస్బీ డిఎస్పీ శ్రీ కెవివి సత్యనారాయణ, పెద్దాపురం డిఎస్పీ శ్రీ ఎబిజి తిలక్, ఏ ఆర్ డిఎస్పీ శ్రీ వి జి శ్రీహరి రావు, జిల్లాలోని సిఐలు, ఎస్సైలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీ కె వెంకటరావు, శ్రీ ఎం నరసింహ మూర్తి, ఆర్ ఎస్సైలు, పోలీసు సిబ్బంది మరియు పెద్దసంఖ్యలో కాకినాడ జిల్లా యువత పాల్గొన్నారు.

అలాగే ఈ నెల 31వ తేదీన కాకినాడ, పోలీస్ కళ్యాణ మండపం వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ గారు తెలియజేశారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (ఏక్తా దివస్) సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించిన కాకినాడ జిల్లా పోలీసులు

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (ఏక్తా దివస్) సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించిన కాకినాడ జిల్లా పోలీసులు

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (ఏక్తా దివస్) సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించిన కాకినాడ జిల్లా పోలీసులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *