Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
NTR District

సత్యమ్మ తల్లికి కోగంటి సత్యం పూజలు విగ్రహ ప్రతిష్టకు లక్ష విరాళం

Punnami Newsroom Published:
సత్యమ్మ తల్లికి కోగంటి సత్యం పూజలు విగ్రహ ప్రతిష్టకు లక్ష విరాళం

*సత్యమ్మ తల్లికి కోగంటి సత్యం పూజలు*

*విగ్రహ ప్రతిష్టకు లక్ష విరాళం*

దసరా ఉత్సవాల అన్న సంతర్పణకు అల్తాఫ్ బాబా వితరణ

ఇబ్రహీంపట్నం,

దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకొని కొండపల్లి, ఇబ్రహీంపట్నం లో ప్రముఖ పారిశ్రామిక వేత్త కోగంటి సత్యం పర్యటించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా కొండపల్లి మున్సిపాలిటీ లో కొలువైన అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం లో నిర్మాణ దశ లో ఉన్న సత్యమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించిన ఆయన గుడి నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట వివరాలు అడిగి తెలుసుకున్నారు. సత్యమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యుల విజ్ఞప్తి మేరకు విగ్రహ ప్రతిష్ట కు లక్ష రూపాయలు విరాళం గా ప్రకటించారు. అనంతరం
కొండపల్లి గాయత్రి నగర్ పురాతన ఆలయం గాయత్రీ దేవి ఆలయాన్ని సందర్శించి గాయత్రి దేవిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ అభివృద్ధి కి సహకారం అందిస్తానని కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. కొండపల్లి లో వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న దసరా నవరాత్రి విగ్రహాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోగంటి సత్యం తో పాటు కొండపల్లి సయ్యద్ హజరత్ షా బుకారి బాబా ఆస్థాన పీఠాధిపతి మహమ్మద్ అల్తాఫ్ రజా సైతం అమ్మవారి దర్శనం చేసుకుని అన్నసంతర్పణ కు విరాళాలు అందజేశారు.
ఇబ్రహీంపట్నం సత్యమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కు 5వేలు ఆర్థిక సహాయం, గాయత్రీ దేవి ఆలయంలో అన్నసంతర్పణ కు 3 వేలు విరాళం అందజేసి భిన్నత్వం లో ఏకత్వానికి నిదర్శనం గా నిలిచారు.

సత్యమ్మ తల్లికి కోగంటి సత్యం పూజలు విగ్రహ ప్రతిష్టకు లక్ష విరాళం

సత్యమ్మ తల్లికి కోగంటి సత్యం పూజలు విగ్రహ ప్రతిష్టకు లక్ష విరాళం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *