Story highlights
- Uploaded Video:
సీఎస్‌పురం: మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గం సీఎస్‌పురం మండలం కోయిలంపాడు గ్రామంలోని శ్రీ మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానంలో వరుణయాగం, వరుణజపం కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Uploaded Video: