Story highlights
- *శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ ఎస్.
- రాంసుందర్ రెడ్డి* *ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పణ* విజయనగరం, జిల్లా బ్యూరో/ రమణ, అక్టోబర్ 27.
- పున్నమి ప్రతినిధి విజయనగరం ప్రజల ఇలవేల్పు, ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం శ్రీ పైడితల్లి అమ్మవారిని జిల్లా కలెక్టర్ ఎస్.
*శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి*
*ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పణ*
విజయనగరం, జిల్లా బ్యూరో/ రమణ, అక్టోబర్ 27. పున్నమి ప్రతినిధి
విజయనగరం ప్రజల ఇలవేల్పు, ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం శ్రీ పైడితల్లి అమ్మవారిని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సతీసమేతంగా దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి కలెక్టర్ దంపతులు అత్యంత భక్తిశ్రద్ధలతో పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ అధికారులు, అర్చకులు కలెక్టర్ దంపతులకు ఘన స్వాగతం పలికి, అమ్మవారి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
అనంతరం అర్చకులు కలెక్టర్ దంపతులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటాన్ని అందించి, వేదాశీర్వచనం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శిరీష, ఆర్డీవో సుధా సాగర్, తదితరులు పాల్గొన్నారు.