Story highlights
- విశాఖపట్నం 24 8 2026 పున్నమి ప్రతినిధి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనలకు అనుగుణంగా స్థానిక ఎన్నికలపై చర్చలు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సూచనలకు అనుగుణంగా కూటమి భాగస్వామ్య పక్షాలతో చర్చించడం జరుగుతుంది.
- ఈ చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి.
- కూటమి తరఫున అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చిస్తున్నారు.
విశాఖపట్నం 24 8 2026 పున్నమి ప్రతినిధి
శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనలకు అనుగుణంగా స్థానిక ఎన్నికలపై చర్చలు
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సూచనలకు అనుగుణంగా కూటమి భాగస్వామ్య పక్షాలతో చర్చించడం జరుగుతుంది. ఈ చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి. కూటమి తరఫున అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చిస్తున్నారు.
క్షేత్ర స్థాయి నుంచి సేకరించిన సమాచారాన్ని పారదర్శకంగా సమీక్షించిన మీదట జనసేన పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులకు సంబంధించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తుది నిర్ణయం తీసుకుంటారు.
జనసేన పోటీ చేసే స్థానాలు ఇవే, పోటీ చేసే అభ్యర్థులు వీరే అంటూ సాగుతున్న ప్రచారాన్ని ఎవరూ విశ్వసించవద్దు. మరికొన్ని చోట్ల అభ్యర్థుల పేరుతో తీర్మానాలు చేస్తున్న విషయం పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి చేరింది. పార్టీ విధివిధానాలు, క్రమశిక్షణను అందరూ పాటించాలి. జన సైనికులు, వీర మహిళల పోరాట స్ఫూర్తిని, వారి ఆత్మ గౌరవాన్ని నిలిపే విధంగా జనసేన పోటీ ఉంటుందని ఇటీవలి పార్టీ శాసన సభ పక్ష సమావేశంలో వెల్లడించిన విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తించాలి.
-జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం