Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Dr. B.R. Ambedkar Konaseema

శ్రీనగర్ లో నిర్వహించనున్న సాఫ్ట్ టెన్నిస్ జాతీయ పోటీలకు ఎంపికైన తాళ్లరేవు క్రీడాకారిణులకు ఆర్థిక సహాయం

Punnami Newsroom Published: Updated:
శ్రీనగర్ లో నిర్వహించనున్న సాఫ్ట్ టెన్నిస్ జాతీయ పోటీలకు ఎంపికైన తాళ్లరేవు క్రీడాకారిణులకు ఆర్థిక సహాయం

Story highlights

  • కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగి గ్రామానికి చెందిన ఏ.
  • దివ్య జ్యోతి మరియు కోట భాగ్యశ్రీ లు సాఫ్ట్ టెన్నిస్ జూనియర్స్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
  • జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి సాఫ్ట్ టెన్నిస్ పోటీల్లో వారు పాల్గొననున్నారు.ఈ సందర్భంగా వారి ప్రయాణం, ఇతర ఖర్చుల నిమిత్తం శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యులు బ దాట్ల సుబ్బరాజు చేతుల మీదుగా రూ.40,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా…

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగి గ్రామానికి చెందిన ఏ. దివ్య జ్యోతి మరియు కోట భాగ్యశ్రీ లు సాఫ్ట్ టెన్నిస్ జూనియర్స్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి సాఫ్ట్ టెన్నిస్ పోటీల్లో వారు పాల్గొననున్నారు.ఈ సందర్భంగా వారి ప్రయాణం, ఇతర ఖర్చుల నిమిత్తం శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యులు బ దాట్ల సుబ్బరాజు చేతుల మీదుగా రూ.40,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ, జాతీయ స్థాయి పోటీల్లో క్రీడాకారిణులు ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయాలు సాధించి, తాళ్లరేవు మండలంతో పాటు ముమ్మిడివరం నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు,తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ధూళిపూడి వెంకటరమణ (బాబి), సీనియర్ నాయకులు నడింపల్లి సూర్యనారాయణ రాజు ( వినోద్ వర్మ ), పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *