నాగార్జున నగర్ కాలనీ: మేడ్చల్ జిల్లా,
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ప్రోత్సాహ సహాయకారంతో నాగార్జున నగర్ కాలనీలోని దుర్గా భవానీ దేవాలయం ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. శ్రీకృష్ణ కూచిపూడి కళాక్షేత్రం నృత్య అధ్యాపకురాలు శ్రీమతి కీసరి రామాలక్ష్మి నృత్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నాట్య ప్రదర్శన మరియు శ్రీకృష్ణ మెలొడీస్ మ్యూజిక్ ఆర్గనైజర్ శ్రీనివాస్ చారి బృందం నిర్వహించిన భక్తి గాన లహరి కాలనీవాసులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా నాట్య గురువు కీసరి రామాలక్ష్మి శిష్య బృందం అత్యద్భుతంగా నర్తించి ప్రేక్షకుల ప్రశంసలు, అభిమానాన్ని పొందారు. ముఖ్యంగా 5 ఏళ్ల చిన్నారి పాప శ్యాన్విక తన నృత్యంతో అందరినీ ఆశ్చర్యపరచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అలాగే, గాన కళాకారులు శ్రీనివాస్ చారి బృందం ఆలపించిన భక్తి గీతాలు భక్తులను పరవశింపజేశాయి. కార్యక్రమానికి హాజరైన కాలనీవాసులు కళాకారుల ప్రతిభను కొనియాడారు.
రిపోర్టర్: సందీప్
పౌర్ణమి పత్రిక (మల్కాజ్గిరి / మేడ్చల్ జిల్లా)

