संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

శిశుగృహం నుంచి చిన్నారికి కొత్త జీవితం.. ఒడిశా దంపతులకు దత్తత

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
శిశుగృహం నుంచి చిన్నారికి కొత్త జీవితం.. ఒడిశా దంపతులకు దత్తత

खबर की मुख्य बातें

  • నెల్లూరు (కలెక్టరేట్), నవంబరు (పున్నమి): నెల్లూరు నగరంలోని శిశుగృహంలో సంరక్షణ పొందుతున్న ఓ చిన్నారికి కొత్త కుటుంబం లభించింది.
  • ఒడిశా రాష్ట్రానికి చెందిన దంపతులు ఆ చిన్నారిని చట్టబద్ధంగా దత్తత తీసుకున్నారు.
  • ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా దత్తత ఉత్తర్వులను దంపతులకు అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారిని ప్రేమాభిమానాలతో పెంచుతూ, మంచి విద్యను అందించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు.

నెల్లూరు (కలెక్టరేట్), నవంబరు (పున్నమి):

నెల్లూరు నగరంలోని శిశుగృహంలో సంరక్షణ పొందుతున్న ఓ చిన్నారికి కొత్త కుటుంబం లభించింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన దంపతులు ఆ చిన్నారిని చట్టబద్ధంగా దత్తత తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా దత్తత ఉత్తర్వులను దంపతులకు అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారిని ప్రేమాభిమానాలతో పెంచుతూ, మంచి విద్యను అందించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు. చిన్నారికి కుటుంబంలో తగిన భద్రత, సంరక్షణ కల్పించాలని దంపతులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్. నాగశైలజ, జిల్లా బాలల సంరక్షణ అధికారి సురేష్, శిశుగృహ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *