మైలవరం ఎన్టీఆర్ జిల్లా పున్నమి న్యూస్
మైలవరం పోలీస్ స్టేషన్.
మైలవరం సీఐ శ్రీ కిషోర్ బాబు గారికి మెరిటోరియస్ సర్టిఫికెట్.
మైలవరం: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మైలవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కిషోర్ బాబు గారికి విశిష్ట సేవలకు గుర్తింపుగా మెరిటోరియస్ సర్టిఫికెట్ అందజేశారు.
గౌరవ రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఈ మెరిటోరియస్ సర్టిఫికెట్‌ను సీఐ శ్రీ కిషోర్ బాబు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీ ఎస్.వి. రాజశేఖర్ బాబు, ఐపీఎస్ గారి అభినందనలు కూడా అందుకున్నారు.
విధి నిర్వహణలో ప్రతిభ, నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు, నిరంతర మానిటరింగ్, ప్రజల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ మెరిటోరియస్ సర్టిఫికెట్ అందజేశారు.
మైలవరం సర్కిల్ పరిధిలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు సీఐ శ్రీ కిషోర్ బాబు చేస్తున్న కృషికి ఈ గుర్తింపు నిదర్శనంగా నిలిచింది.
మైలవరం సర్కిల్‌కు గర్వకారణమైన ఈ విశిష్ట గుర్తింపు పొందిన సీఐ శ్రీ కిషోర్ బాబు గారికి పున్నమి న్యూస్ తరఫున హృదయపూర్వక అభినందనలు.
కావున, ఈ ప్రెస్ నోట్ ద్వారా మైలవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కిషోర్ బాబు గారికి లభించిన ఈ విశిష్ట గుర్తింపును మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, ఆయనకు మైలవరం సర్కిల్ పోలీస్ సిబ్బంది తరఫున హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతున్నది..
సమాచారం ఇచ్చినవారు మైలవరం పోలీస్ స్టేషన్ సిబ్బంది…

