Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Nirmal

శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకున్న సయ్యద్ అర్జుమంద్ అలీ

Punnami Newsroom Published:
శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకున్న సయ్యద్ అర్జుమంద్ అలీ

Story highlights

  • నిర్మల్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం నిర్మల్ పట్టణంలోని పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ దర్శించుకున్నారు.
  • ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
  • అనంతరం ఆయన మాట్లాడుతూ..

నిర్మల్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం నిర్మల్ పట్టణంలోని పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడమే కాకుండా, ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఆకుల హరీష్, కౌన్సిలర్లు నాందేడేపు చిన్ను, కత్తి నరేందర్, జింక సూరి, ధర్మాజీ శీను, షేక్ ఫిరోజ్, జిల్లా మైనార్టీ చైర్మన్ జునైద్ మెమన్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సమరసింహారెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొంతం గణేష్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు సాయి ప్రతాప్, నరేందర్, ప్రశాంత్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *