Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Tirupati

*వైసీపీకి షాక్.. కోటపోలూరులో కాంగ్రెస్ లోకి జోగి వినోద్*

Punnami Newsroom Published:
*వైసీపీకి షాక్.. కోటపోలూరులో కాంగ్రెస్ లోకి జోగి వినోద్*

Story highlights

  • సూళ్లూరుపేట, సెప్టెంబర్ 4 సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.
  • కోటపోలూరు గ్రామానికి చెందిన వైసీపీ యువ నాయకుడు జోగి వినోద్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.తిరుపతి జిల్లా డీసీసీ అధ్యక్షులు బాలగురువం బాబు మరియు సూళ్లూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డి.
  • కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో..

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 4

సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కోటపోలూరు గ్రామానికి చెందిన వైసీపీ యువ నాయకుడు జోగి వినోద్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.తిరుపతి జిల్లా డీసీసీ అధ్యక్షులు బాలగురువం బాబు మరియు సూళ్లూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డి. కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో.. ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి గారి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.అనంతరం జోగి వినోద్ కు తిరుపతి జిల్లా రైతు విభాగం అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు అప్పగించారు.ఈ సందర్భంగా జోగి వినోద్ మాట్లాడుతూ…”మా తాత, మా కుటుంబ సభ్యులందరూ గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారే. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులుగా ఉన్నాము. అదే దిశలో నేను కూడా పయనించాలని నిర్ణయించుకుని కాంగ్రెస్ పార్టీలో చేరాను. పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తాను. రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేసేందుకు నా వంతు కృషి చేస్తాను” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జోగి వినోద్ అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *