Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Prakasam

వైభవంగా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి నూతన ఆలయ నిర్మాణ శంకుస్థాపన

Punnami Newsroom Published:
వైభవంగా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి నూతన ఆలయ నిర్మాణ శంకుస్థాపన

Story highlights

  • పామూరు, (పున్నమి ): పామూరు పట్టణంలో శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి నూతన ఆలయ నిర్మాణ శంకుస్థాపన వేడుకలు వైభవంగా నిర్వహించారు.
  • వేద పండితుల మంత్రోచ్ఛారణలు, ప్రత్యేక పూజలు, హోమాల మధ్య శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమానికి పట్టణంలోని ఆర్యవైశ్య సోదర సోదరీమణులు, పుర ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
  • ఆలయ కమిటీ అధ్యక్షులు యాదాల వెంకట సాయి కిరణ్ దంపతులు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.

పామూరు, (పున్నమి ): పామూరు పట్టణంలో శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి నూతన ఆలయ నిర్మాణ శంకుస్థాపన వేడుకలు వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, ప్రత్యేక పూజలు, హోమాల మధ్య శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమానికి పట్టణంలోని ఆర్యవైశ్య సోదర సోదరీమణులు, పుర ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ కమిటీ అధ్యక్షులు యాదాల వెంకట సాయి కిరణ్ దంపతులు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, నవగ్రహ పూజ, అష్టదిక్పాలక పూజ, పంచలోహ కలశ పూజ, శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి పూజ, భూమి పూజ, నవరత్న పంచలోహ స్థాపన తదితర క్రతువులను వేద పండితులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం గణపతి హోమం, నవగ్రహ హోమం, లక్ష్మీ సుదర్శన హోమం, మూలమంత్ర హోమం నిర్వహించి పూర్ణాహుతితో పూజా కార్యక్రమాలను ముగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో మెంటా బాలరాగవులు, కోటా నరసింహారావు, దర్శి మస్తాన్ రావు, కొండేటి సురేష్, సోమిశెట్టి వేణుగోపాలరావు, రాచమడుగు వేణు, యాదాల నాగేశ్వరరావు, యాదాల ప్రకాష్ రావు, సొల్లేటి శ్రీనివాసులు, సోమిశెట్టి వెంకట్రావు, ముప్పసాని మహేష్, ముప్పసాని గణేష్, పడుచూరి సుబ్బారావుతో పాటు పలువురు పట్టణ ప్రముఖులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

శంకుస్థాపన వేడుకలకు హాజరై కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన పుర ప్రముఖులకు, ఆర్యవైశ్య సోదర సోదరీమణులకు, భక్తులకు ఆలయ కమిటీ అధ్యక్షులు యాదాల వెంకట సాయి కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల సహకారంతో నూతన ఆలయ నిర్మాణ కార్యక్రమాలు ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *