బైంసా:వానల్పాడ్:మహిషా నగర పరిధిలోని వానల్పాడ్ గ్రామంలో వేప చెట్టుపై స్వయంభువుగా వెలసిన శ్రీ భవానీ మాత సన్నిధి భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఈ పవిత్ర సన్నిధిని మహిషా జై జవాన్ సేవా సమితి సభ్యులు గాలి రాజన్న, కాసరోల్ల ప్రవీణ్ కుమార్, చొప్పరి వెంకటేష్, బండారి దిలీప్ దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా జై జవాన్ సేవా సమితి కుటుంబ సభ్యుల క్షేమం, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల కోసం ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక అర్చనలు చేయించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ముత్యం రెడ్డి, చందర్ పటేల్ అమ్మవారి చిత్రపటాలను సమితి సభ్యులకు అందజేశారు.
జగన్మాత శ్రీ భవానీ దేవి కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలి,అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా భక్తులు ఆకాంక్షించారు. భక్తి భావంతో సాగిన ఈ దర్శన కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపింది.
