Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Annamayya

వర్షాల కారణంగా నీటి కుంటగా మారిన చిట్వేల్ బ్రాహ్మణ వీధి

Punnami Newsroom Published:
వర్షాల కారణంగా నీటి కుంటగా మారిన చిట్వేల్ బ్రాహ్మణ వీధి

Story highlights

  • చిట్వేలి ఆగస్టు ( పున్నమి ప్రతినిధి) చిట్వేల్ పట్టణంలోని బ్రాహ్మణ వీధి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
  • గత కొంతకాలంగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లపై నుంచి పారిన వర్షపు నీరు బ్రాహ్మణ వీధిలో చేరి నీటి కుంటలాగా మారింది.
  • దాంతో వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగించడం కష్టసాధ్యమైంది.

చిట్వేలి ఆగస్టు ( పున్నమి ప్రతినిధి)

చిట్వేల్ పట్టణంలోని బ్రాహ్మణ వీధి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొంతకాలంగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లపై నుంచి పారిన వర్షపు నీరు బ్రాహ్మణ వీధిలో చేరి నీటి కుంటలాగా మారింది. దాంతో వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగించడం కష్టసాధ్యమైంది. చిన్నారులు, వృద్ధులు మరింత ఇబ్బందులు పడుతున్నారు.స్థానిక ప్రజలు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాని పరిస్థితి నెలకొంది. రోడ్డు మరమ్మతులు, నీరు వెళ్లే డ్రైనేజీ సదుపాయం లేకపోవడంతో ఇలాంటి సమస్యలు తరచుగా ఎదురవుతున్నాయి.
అందువల్ల సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, సమస్యను పరిష్కరించి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *