खबर की मुख्य बातें
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్ రైల్వే స్టేషన్ కు వచ్చిన లైఫ్ లైన్ ఎక్స్ ప్రెస్(రైలు పట్టాలపై వైద్యశాల) ను డిఎంఎచ్ఓ డా.
- సిడాం నాగేంద్ర తో కలిసి, శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు పరిశీలించారు.
- ఈ సందర్భంగా రైల్వే అధికారులు, పోలీసు సిబ్బంది మరియు స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులకు పలు సూచనలు చేయడం జరిగింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్ రైల్వే స్టేషన్ కు వచ్చిన లైఫ్ లైన్ ఎక్స్ ప్రెస్(రైలు పట్టాలపై వైద్యశాల) ను డిఎంఎచ్ఓ డా. సిడాం నాగేంద్ర తో కలిసి, శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులు, పోలీసు సిబ్బంది మరియు స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులకు పలు సూచనలు చేయడం జరిగింది. అక్టోబర్ 16 నుండి నవంబర్ 5వ తేదీ వరకు 20 రోజుల పాటు ఔట్ పేషంట్ వైద్య సేవలు మరియు ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సిర్పూర్ మరియు ఆసిఫాబాద్ నియోజకవర్గ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కంటి ఆపరేషన్లు, పిల్లలకు సంబంధించిన ఎముకల ఆపరేషన్లు, చెవి ముక్కు మరియు గొంతు, ప్లాస్టిక్ సర్జరీ మరియు డెంటల్ కు సంబంధించిన సేవలు ఉచితంగా పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైఫ్ లైన్ ఎక్స్ ప్రెస్ నిర్వాహకులు డా.మనోహర్ రెడ్డి, యోగేష్, నాయకులు వీరభద్ర చారి, హనుమంత రావు, అరుణ్ కుమార్ లోయా, పెద్ది హరీష్, సాయి కుమార్, పవన్ బల్దేవా తదితరులు పాల్గొన్నారు.