Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Warangal

రేవంత్‌ది తుగ్లక్ పాలన.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఖండన

Punnami Newsroom Published:
రేవంత్‌ది తుగ్లక్ పాలన.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఖండన

ఖానాపురం బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు. మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు. మాజీ మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్. మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట నరసయ్య. బి ఆర్ ఎస్ పార్టీ వివిధ గ్రామాల సర్పంచులు, మాట్లాడుతూ..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేసింది. విద్యుత్ కొరత, సాగునీరు, తాగునీటి సమస్యలపై ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించింది.
ఎల్‌నినో ప్రభావం, కరువు పరిస్థితులపై ముందుచూపుతో చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపించింది. కాళేశ్వరం ప్రాజెక్టును సమర్థంగా వినియోగించుకోవాలని, రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, నిల్వలు, కొనుగోళ్ల వివరాలను ప్రజలకు వెల్లడించాలని కోరింది.
రాబోయే పది నెలలకు సరిపడా తాగునీరు, సాగునీటి నిల్వలపై సమీక్ష నిర్వహించి కార్యాచరణ ప్రకటించాలని, నిత్యావసర సరుకుల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు నూనె, పప్పుధాన్యాలను కూడా అందించాలని ప్రభుత్వాన్ని నిలదీశారు.

రేవంత్‌ది తుగ్లక్ పాలన.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఖండన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *