Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
NTR District

రెడ్డిగూడెం మండలంలో రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ఘనంగా జరగడం జరిగింది పున్నమి న్యూస్ ఎన్టీఆర్ జిల్లా

Punnami Newsroom Published:
రెడ్డిగూడెం మండలంలో రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ఘనంగా జరగడం జరిగింది పున్నమి న్యూస్ ఎన్టీఆర్ జిల్లా

*ఘనంగా వై ఎస్ రాజశేఖరరెడ్డి గారి వర్ధంతి*

*మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా బుధవారం నాడు రెడ్డిగూడెం మండలం కూనపరాజు పర్వ, ముచ్చనపల్లి, మద్దుల పర్వ, సీతారాంపురం, అన్నెరావుపేట గ్రామాల్లో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.*

*ఈ సందర్భంగా విజయభాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతూ, మహానేత వైఎస్సార్ భౌతికంగా మన మధ్య లేకపోయినా… ఆయన పేరు ప్రజల గుండెల్లో సజీవంగా ఉందని, ఆయన చూపిన అభివృద్ధి మార్గం నేటికీ రాష్ట్రానికి దిక్సూచిగా నిలుస్తోందని అన్నారు.*
*పేదవాడి ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అని భావించి ఆరోగ్యశ్రీని, అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడేందుకు 108 అంబులెన్స్* *సేవలను, గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు చేరువ చేసేందుకు 104 సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన* *దార్శనికుడు వైఎస్సార్ అని కొనియాడారు.*
*రైతు సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని నమ్మిన మహానేత, ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ వంటి పథకాలతో* *అన్నదాతకు అండగా నిలిచారని పేర్కొన్నారు. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా భరోసా కల్పించి, విద్యను నిరుపేదలకు చేరువ చేశారని గుర్తు చేశారు..*

*ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు మద్దిరెడ్డి జమాలారెడ్డి గారు, ఎన్టీఆర్ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి తోటకూర రవిబాబు గారు, జిల్లా కార్యదర్శి పాలంకి సురేష్ రెడ్డి గారు, ఎన్టీఆర్ జిల్లా బీసీ సెల్ జనరల్ సెక్రెటరీ కొలుసు గంగాధర్ గారు,జిల్లా ఎస్సీ సెల్ జనరల్ సెక్రెటరీ మైలమాల కాంతారావు గారు,మద్దుల పర్వ గ్రామ పార్టీ అధ్యక్షులు పాలంకి రమణారెడ్డి గారు, కూనపరాజు పర్వ గ్రామ పార్టీ అధ్యక్షులు చింత శ్రీను గారు, అన్నెరావుపేట గ్రామ పార్టీ అధ్యక్షులు మనికల వెంకయ్య గారు, మిద్దె సుదీర్ గారు, మాజీ సర్పంచ్ మాతంగి వెంకటేశ్వరరావు గారు,కోమటి కృష్ణ గారు మరియు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు..*

రెడ్డిగూడెం మండలంలో రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ఘనంగా జరగడం జరిగింది పున్నమి న్యూస్ ఎన్టీఆర్ జిల్లా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *