Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Peddapalli

యువతకు ఆదర్శం.. పెద్దపల్లిలో జడ్జీలకు ఘన సత్కారం

Punnami Newsroom Published:
యువతకు ఆదర్శం.. పెద్దపల్లిలో జడ్జీలకు ఘన సత్కారం

Story highlights

  • పెద్దపల్లి, అక్టోబర్ 18: పట్టుదల, కృషి ఉంటే సాధించలేనిదేమీ లేదని నిరూపించారు పెద్దపల్లి జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు.
  • ఇటీవల తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నిర్వహించిన న్యాయసేవా నియామక పరీక్షల్లో జూనియర్ సివిల్ జడ్జీలుగా ఎంపికై, తమ ప్రతిభతో జిల్లా పేరును రాష్ట్రస్థాయిలో మార్మోగించారు.పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన చిప్ప సౌమ్య, రాఘవాపూర్ గ్రామానికి చెందిన వేముల హరిక జూనియర్ సివిల్ జడ్జీలుగా బాధ్యతలు చేపట్టడం…
  • ఒకే జిల్లా నుంచి ఇద్దరు మహిళలు న్యాయమూర్తులుగా ఎంపిక కావడం జిల్లాకే ఎంతో గర్వకారణమని పలువురు కొనియాడారు.

పెద్దపల్లి, అక్టోబర్ 18:

పట్టుదల, కృషి ఉంటే సాధించలేనిదేమీ లేదని నిరూపించారు పెద్దపల్లి జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నిర్వహించిన న్యాయసేవా నియామక పరీక్షల్లో జూనియర్ సివిల్ జడ్జీలుగా ఎంపికై, తమ ప్రతిభతో జిల్లా పేరును రాష్ట్రస్థాయిలో మార్మోగించారు.పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన చిప్ప సౌమ్య, రాఘవాపూర్ గ్రామానికి చెందిన వేముల హరిక జూనియర్ సివిల్ జడ్జీలుగా బాధ్యతలు చేపట్టడం పట్ల స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే జిల్లా నుంచి ఇద్దరు మహిళలు న్యాయమూర్తులుగా ఎంపిక కావడం జిల్లాకే ఎంతో గర్వకారణమని పలువురు కొనియాడారు.

ఈ సందర్భంగా పెద్దపల్లిలోని అమర్‌చంద్ కళ్యాణ మంటపంలో జిల్లా పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఇద్దరు యువ జడ్జీలకు ప్రత్యేక అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వారిని శాలువాలతో కప్పి, జ్ఞాపికలు (మెమెంటోలు) అందజేసి ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ సాధారణ కుటుంబాల నుంచి వచ్చి, తీవ్రంగా శ్రమించి న్యాయమూర్తులుగా ఉన్నత స్థానానికి ఎదిగిన సౌమ్య, హరికల విజయం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకమన్నారు. పద్మశాలి బాంధవులు, ముఖ్యంగా నేటి యువత, విద్యార్థులు వీరిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక సత్తయ్య, గుండేటి రాజేష్, ప్రధాన కార్యదర్శి అలా రమేష్, జాయింట్ సెక్రటరీ సాయిరి మహేందర్, జిల్లా ప్రచార కార్యదర్శి ధనుంజయ్ పాల్గొన్నారు. అలాగే రొంపికుంట సంఘం అధ్యక్షుడు కూచన మల్లయ్య, కమాన్‌పూర్ మండల అధ్యక్షుడు (మాజీ సర్పంచ్) కుందారపు బాపు, కమాన్‌పూర్ సింగిల్ విండో డైరెక్టర్ గుండేటి శ్రీమూర్తి, రామగుండం పద్మశాలి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి ఆడేపు శంకర్, గుండేటి శంకర్, ఓదెల మండల సంఘం అధ్యక్షుడు పర్ష రమేష్‌తో పాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సంఘ నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన జడ్జీలకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *