संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अनकापल्ली

యలమంచిలి 22వ వార్డులో బీజేపీ జోరు.. నామినేషన్‌కు సిద్ధమైన మాజీ సైనికుడు నక్కా శివ శంకరరావు!

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
యలమంచిలి 22వ వార్డులో బీజేపీ జోరు.. నామినేషన్‌కు సిద్ధమైన మాజీ సైనికుడు నక్కా శివ శంకరరావు!

खबर की मुख्य बातें

  • యలమంచిలి మున్సిపాలిటీలో ఎన్నికల సందడి నెలకొంది.
  • 22వ వార్డు కౌన్సిలర్ స్థానానికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థిగా మాజీ సైనికుడు నక్కా శివ శంకరరావు ఆదివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
  • ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 11:30 గంటలకు నామినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

యలమంచిలి మున్సిపాలిటీలో ఎన్నికల సందడి నెలకొంది. 22వ వార్డు కౌన్సిలర్ స్థానానికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థిగా మాజీ సైనికుడు నక్కా శివ శంకరరావు ఆదివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 11:30 గంటలకు నామినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆయన నామినేషన్ నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషుల్లో ఉత్సాహం నెలకొంది.దేశ రక్షణలో సైనికుడిగా సేవలందించిన నక్కా శివ శంకరరావు, అదే క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ఆయన అభిమానులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాయకత్వంతో పాటు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, మాజీ చైర్‌పర్సన్ పిళ్లా రమాకుమారి, విశాఖ డెయిరీ చైర్మన్ పిళ్లా ఆనంద్ కుమార్ తదితర నాయకుల స్ఫూర్తితో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.22వ వార్డులో స్థానిక సమస్యల పరిష్కారం, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించడం లక్ష్యంగా ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు అనుచరులు వెల్లడించారు. నామినేషన్ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల సహకారంతో ఎన్నికల ప్రక్రియలో ముందుకు సాగుతామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *