*ద్వారకా తిరుమల చైర్మన్ మరియు వంశపారంపర్య ధర్మకర్తలను మర్యాదపూర్వకంగా కలిసి తమ సంఘీభావం తెలిపినమదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు మరియు సభ్యులు*
ఈరోజు ద్వారకా తిరుమల చైర్మన్ శ్రీ ఎస్.వి. సుధాకర్ రావు గారిని మరియు ద్వారకా తిరుమల వంశపారంపర్య ధర్మకర్త శ్రీ ఎస్.వి.ఎన్. నివృత్తరావు గారిని మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు కోయ సుధా మరియు ట్రస్ట్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, మన ప్రాంతానికి చెందిన పెద్దలు, అనుభవజ్ఞులు స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజలకు మార్గదర్శకులుగా ఉండటం ఎంతో అవసరమని ట్రస్ట్ సభ్యులు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ముఖ్యంగా శ్రీ ఎస్.వి.ఎన్. నివృత్తరావు గారు స్థానికంగా ఉంటూ ప్రజలకు, ప్రాంత అభివృద్ధికి తమ సహకారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు కోయ సుధా, కార్యదర్శి సగ్గుర్తి విజయలక్ష్మి, కోశాధికారి ద్రోణవల్లి విజయలక్ష్మి, సభ్యులు నాగమణి, కవిత, వందన, గీత, లక్ష్మీ కృష్ణకుమారి,ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు,

