Story highlights
- Uploaded Video:
అక్టోబర్ 15 పున్నమి ప్రతినిధి నిర్మల్ జిల్లా బాసర దేవి శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు ఆరవ రోజు రోజు మహిషాసురమర్ధిని స్వరూపమైన, సింహాన్నిపై కాత్యాయనీ దేవి గా నాలుగు చేతులతో సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకువజామున బాలాలయం లో అమ్మవారికి మహా అభిషేకం, మహా హారతి, మల్లెపుష్పార్చన నిర్వహించి, అనంతరం నైవేద్యం గా రవ్వ కేసరి సమర్పించిన ఆలయ అర్చకులు, వేదపండితులు. చదువుల తల్లి చేతిలో ఉండే వీణ స్థానంలో, దుష్టశిక్షణ-శిష్టరక్షణను సూచించేలా కత్తి, ఖడ్గం, పద్మం వంటి ఆయుధాలతో అమ్మవారు రౌద్ర మరియు శాంత స్వరూపాల కలయికతో దర్శనమిస్తారు. కాళీ, లక్ష్మీ, సరస్వతి ముగ్గురూ కొలువై ఉన్న త్రిశక్తి పీఠం అయిన బాసరలో శాంత స్వరూపిణి అయిన సరస్వతి మాతను ఇలా కాత్యాయనీ దేవిగా దర్శించుకోవడం వల్ల వివాహ బంధాలలో ఉన్న అడ్డంకులు తొలగుతాయని, ఇష్టకార్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో ఆరవ రోజు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు మహిషాసురమర్ధిని స్వరూపమైన, సింహాన్నిపై కాత్యాయనీ దేవి గా భక్తులను దర్శనం అనుగ్రహిస్తాన్నారు
Uploaded Video:
